వికేంద్రీకరణకు మద్దతుగా మండ‌ల మీట్‌లో ఏకగ్రీవ తీర్మానం

విజ‌య‌న‌గ‌రం: వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ పరిపాలన రాజధాని చేయాలని జామి మండ‌ల సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. గురువారం  జామి మండల కేంద్రంలోని మండ‌ల ప‌రిష‌త్‌ కార్యాలయంలో జామి ఎంపీపీ సబ్బవరపు అరుణ అధ్యక్షతన మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో వికేంద్రీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తుగా స‌భ్యులు ఏక‌గ్రీవ తీర్మానానికి ఆమోదం తెలిపారు. స‌మావేశానికి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను),ఎస్ కోట శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు, శాసనమండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు, ప్ర‌జాప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.  

తాజా వీడియోలు

Back to Top