పాత ఎడ్లంక కాజు వే గండి పూడ్చివేత‌

కృష్ణా జిల్లా : అవనిగడ్డ నియోజకవర్గం పాత ఎడ్లంక కాజు వేకు భారీ వర్షం కారణంగా గండి పడ‌టంతో వెంట‌నే మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టి గండిని పూడ్చివేశారు. అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, కృష్ణ, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల రైతు విభాగం జోనల్ ఇంచార్జ్ కడవకొల్లు నరసింహారావు ఆదేశాల మేర‌కు అవనిగడ్డ జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మినారాయణ, మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ నజీర్ భాష, అవనిగడ్డ మాజీ ఉప సర్పంచ్ గాజుల జయ గోపాల్,  మునిపల్లి వెంకటేశ్వరరావు, అవనిగడ్డ మండల బీసీ సెల్ అధ్యక్షులు సైకం నాగరాజు, మాజీ లంకమ్మ గుడి చైర్మన్ చింతలపూడి బాల భాస్కరరావు, గ్రామస్తులతో కలసి అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక కృష్ణానది పాయలో గ్రామస్తులు రాకపోకలు కొనసాగిస్తున్న కాజువే కు వర్షం కారణంగా ఏర్పడిన గండిని పూడ్చి వేయించారు. అనంతరం పాత ఎడ్లంక గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం మెడికల్ క్యాంపును నాయ‌కులు పరిశీలించారు.

Back to Top