ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

విశాఖ‌: వైయ‌స్ఆర్ రైతు భ‌రోసా-పీఎం కిసాన్ నిధి కింద వ‌రుస‌గా మూడో ఏడాది మొద‌టి విడ‌త‌గా 52.38 ల‌క్ష‌ల మంది రైతులకు రూ.3,928.88 కోట్ల పంట‌ల పెట్టుబ‌డి సాయాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అంద‌జేయ‌డం ప‌ట్ల వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా సీజన్‌ ప్రారంభానికి ముందే రైతన్న చేతిలో పెట్టుబడి సాయం పెడుతోంది. వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ కింద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ గారు తొలి విడత సాయం జమ చేశారు. 

నువ్వింకా ఎదగ లేదు మాలోకం..

నక్కపిల్ల పుట్టి 4 వారాలు కాలేదు, ఇంత పెద్ద గాలివాన జీవితంలో చూడలేదన్నదట. చిట్టి నాయుడు వ్యవహారం అలాగే ఉంది. సమీక్షలు, పరిపాలన గురించి సలహాలు ఇచ్చే స్థాయికి నువ్వింకా ఎదగ లేదు మాలోకం. ఇక్కడికొచ్చి ఒక హాస్పిటల్ ను దత్తత తీసుకుని సేవ చేయి. సొల్లు కబుర్లు మానేసి అంటూ మ‌రో ట్వీట్ చేశారు.

ప్ర‌జ‌లంతా ప్ర‌శ్నిస్తున్నారు..
రుయా ఘటనను భూతద్దంలో చూపిస్తున్న పచ్చ బ్యాచ్ రమేశ్ హాస్పిటల్ లో అగ్నికి ఆహుతైన అభాగ్యుల గురించి, గోదావరి పుష్కరాల్లో బాబు ‘అదృశ్య పాదాల’ కింద నలిగి ప్రాణాలు కోల్పోయిన 30 మంది గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు. జవాబు చెప్పడానికి ఏదైనా పాయింటు ఉందా మీ దగ్గర అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top