అమరావతి: నరసరావుపేట, తిరుపతి, నడికుడి రైల్వే స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. సోమవారం రైల్వే బడ్జెట్‌పై లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ..విభజన జరిగిన ఆరు నెలల్లో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆరేళ్లు గడిచినా కేంద్రం ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు.కనీసం రిక్రూట్‌మెంట్ బోర్డు కూడా ఏర్పాటు చేయలేదన్నారు. వాల్తేర్ డివిజన్‌ను కూడా సౌత్ కోస్ట్ సెంట్రల్ రైల్వేలో ఉంచాలన్నారు. నడికుడి శ్రీకాళహస్తి, మాచర్ల, గద్వాల రైల్వే లైన్లు ఇంకా పూర్తి కాలేదన్నారు.