రైతులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు గాలి కొదిలేశారు

ఎమ్మెల్యే టీజేఆర్  సుధాక‌ర్‌బాబు
 

అమ‌రావ‌తి:  రైతుల‌కు ఇచ్చిన హామీల‌ను చంద్ర‌బాబు ఐదేళ్ల పాల‌న‌లో గాలికి ఒదిలేశార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్‌బాబు విమ‌ర్శించారు. రైతులకు ఉచిత విద్యుత్  చంద్రబాబు సాధ్యం కాదంటే..ఆనాడు వైఎస్ఆర్ సుసాధ్యం చేసి చూపించారని ఆయ‌న గుర్తు చేశారు. రూ.27వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత వైయ‌స్ఆర్‌కే దక్కుతుందని తెలిపారు. 5 ఏళ్ల పాలనలోచంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు నిర్మించలేకపోయారని విమ‌ర్శించారు. రైతు వ్యతిరేక ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రపంచ ఖ్యాతి గడించారన్నారు. చంద్రబాబు బతికినంత కాలం రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. రైతు సమస్యలు పరిష్కరించిన ఘనత సీఎం వైయ‌స్ జగన్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే సుధాక‌ర్‌బాబు తెలిపారు.

తెలుగుదేశం పార్టీ రైతు కోసం తెలుగుదేశం అంటూ వినూత్న కార్యక్రమం చేపట్టిందని చెప్పడం కన్నా.. అది నవ్వులపాలైన కార్యక్రమం అని చెప్పవచ్చు. చంద్రబాబుగారు రైతు కోసం తెలుగుదేశం అని కాకుండా రైతుకు మోసం తెలుగుదేశం అనే టైటిల్‌ పెట్టుకొంటే బ్రహ్మాండంగా ఉండేది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతాంగం శ్రేయస్సు, వారి అభివృద్ధి, వ్యవసాయం గురించి ఆలోచించిన సందర్భాలు అసలు ఉన్నాయా అనే విషయయాన్ని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని ఆ పిలుపు ఇచ్చి ఉంటే బాగుండేది. అధికారంలో ఉన్నన్నాళ్ళూ రైతులను ఇబ్బందిపెట్టి, వ్యవసాయాన్ని నాశనం చేసి.. ఈరోజు ఏ మొహం పెట్టుకుని రైతుల గురించి మాట్లాడతారు. 

 మా రెండున్నరేళ్ల పరిపాలనలో మేము ఏం చేశామో చెబుతాం.. చంద్రబాబు నాయుడు రైతులకు ఏం మోసం చేశారో కూడా స్పష్టంగా చెబుతాం. మరి మీరు రైతులకు ఏం చేశారో చెప్పగలరా? 2014లో అధికారంలోకి రావడానికి రైతాంగానికి ఇచ్చిన హామీలలో ఒక్కటైనా నెరవేర్చారా అన్నది చంద్రబాబు సహా, టీడీపీ నాయకులు అంతా చెప్పాలి. రూ. 87,612 కోట్లు రుణమాఫీ చేస్తామని 2014 ఎన్నికల ముందు చెప్పారు, మరి చేశారా లేదో స్పష్టం చేయాలి. 

  ముందుగా మీ హయాంలో రైతులకు నష్టం జరిగింది,  రైతులను ముంచాము, మోసం చేశామని మీరు ఒప్పుకోవాలి కదా? వాటిని అంగీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తామంటూ హామీ ఇచ్చారు కదా? దాన్ని నెరవేర్చారా? రూ. 5000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు కదా? దాన్ని ఏర్పాటు చేశారా చంద్రబాబుగారూ? దానికి సమాధానం చెప్పగలరా? స్వామినాధన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పారు, చేశారా?

  మీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారాయి. పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. మరి పూర్తి చేశారా? మీ అయిదేళ్ల పాలనలో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్‌ను అయినా పూర్తి చేయగలిగారా? రెయిన్‌గన్‌లతో తుఫాన్లను సముద్రంలోనే అణిచివేస్తామని మాయమాటలు చెప్పారు. మీ రెయిన్‌ గన్‌లు ఏమయ్యాయి. మీరు అసలు రైతు కోసం ఏం చేశారో చెప్పి.. ఆ తర్వాతే రోడ్ల మీదకు రండి. 

 కోవిడ్‌ వల్ల ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు రైతులు, పేదల పక్షాన నిలిచారు. చంద్రబాబు మాదిరిగా తప్పుడు వాగ్దానాలు చేసి, రైతులని మోసం చేయటం ఇష్టం లేకే 2014 లో అధికారాన్ని వదులుకొన్నాము. మీ మాదిరిగా తప్పుడు హామీలు ఇచ్చి ఉంటే ఆరోజు గెలుపు మాదే అయ్యుండేది. మీ అయిదేళ్ల పరిపాలనలో రైతులతో సహా విద్యార్థులకు, రోగులకు అందరికీ బకాయిలుపెట్టి వెళితే మేం అధికారంలోకి వచ్చాక,  ముఖ్యమంత్రి జగన్ గారు చెల్లించారు. 

  ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కడితే పంటల బీమా అందిస్తున్నాం. రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసిన ఘనత వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానిదే. అదే రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే వారికి పరిహారం కూడా ఇవ్వని చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిది. రైతు సంక్షేమానికి ఎవరేమి చేశారో బహిరంగ చర్చకు మేము సిద్ధం, మీరు సిద్దమేనా? అంపశయ్యపై ఉన్న టీడీపీని బతికించుకునేందుకు ఇటువంటి పోరాటాలు, దుష్ప్రచారాలు చేస్తున్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా ఉపయోగం ఉండదన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ తెలుసుకోవాలి. రాష్ట్రంలో రైతులు ఎప్పటికీ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వెంటే ఉంటారు.

 గత తెలుగుదేశం ప్రభుత్వంలో పరిపాలన, వ్యవసాయ రంగాన్ని ఏవిధంగా విస్మరించిన విషయాన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ విచిత్రమైన రాజకీయ పోకడతో, అసంబద్ధమైన, అపహాస్యపూరితమైన రాజకీయ వ్యవహార శైలితో మరోమారు రాష్ట్ర రైతుల్ని మోసం చేయడానికి జట్టుగా రైతు కోసం అంటూ రోడ్ల మీదకు వచ్చారు. 

 రైతు వ్యతిరేక ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుగారు కీర్తిని గడించారు. ఆనాడు 2003లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు దుర్భిక్షంతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతూ ఉపాధి కోసం వలసలు వెళ్ళారు. స్వర్గీయ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారు ఉచిత విద్యుత్‌ ఇస్తామని చెబితే.. ఆ ఉచిత విద్యుత్‌ అందించడం అసాధ్యం, ఇస్తే, కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని చంద్రబాబు అపహాస్యం చేశారు. అలాంటిది అధికారంలోకి వచ్చాక ఉచిత విద్యుత్‌ను వైయస్సార్‌ గారు సుసాధ్యం చేశారు. 

 చంద్రబాబు నాయుడు ఏనాడు రైతుల్ని, వ్యవసాయాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు తగుదునమ్మా అంటూ టీడీపీ రైతుల కోసం అంటూ, రైతుల పక్షపాతి అంటూ కొంతమందిని రోడ్ల మీదకు వదిలారు. 2014 ఎన్నికల హామీలో తాను అధికారంలోకి వస్తే బేషరతుగా రైతాంగం నెత్తిమీద ఉన్న రుణాలను సంపూర్ణంగా రద్దు చేస్తామని చెప్పారు, మరి ఇచ్చిన హామీలను నెరవేర్చారా బాబూ..? 
- 9 గంటల ఉచిత విద్యుత్‌ను నిరాటంకంగా సరఫరా చేస్తామని, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీలు ఎందుకు అమలు చేయలేదు. మీరు అధికారంలో ఉన్న 2014-19 కాలంలో రైతులకు ఏం చేశారో.. పంట నష్టాలకు ఎంత చెల్లించారు, రుణ మాఫీ ఎంత చెల్లించారో చెప్పి.. అప్పుడు మాట్లాడండి. 

 సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో వెలిగొండ, హంద్రీనీవా, గాలేరు-నగరీ సహా 2018 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని మాట ఇచ్చి... ఎందుకు వాటిని పూర్తి చేయలేకపోయారు..? అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ అసెంబ్లీలో పోలవరం పూర్తి చేస్తామని అప్పుడు జగన్‌ మోహన్‌ రెడ్డి ఎక్కడ దాక్కుంటారో చెప్పాలంటూ అవాకులు చెవాకులు పేలితే మిమ్మల్ని ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టారో చూశారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. 

  2019లో ప్రజలు కొట్టిన దెబ్బ నుంచి కోలుకోలేక రాష్ట్రం నుంచి పారిపోయి పక్క రాష్ట్రంలో గ్లాస్‌ రూమ్‌ల్లో కూర్చుని రైతాంగం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి. చంద్రబాబు భూమి మీద బతికినంత కాలం ఆంధ్ర రాష్ట్ర రైతాంగం గురించి ఉచ్చరించడానికి నైతిక హక్కేలేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన మహా నాయకుడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారు. అందుకే ఆయన రైతు బాంధవుడిగా నిలిచారు.

  మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏంచేశారు? అంటే మీరు చెప్పలేరు. అదే రెండున్నరేళ్ల మా పాలనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి నాయకత్వంలో రైతులకు పూర్తిగా న్యాయం చేయగలుగుతున్నామని గుండెల మీద చేతులు వేసుకుని మేం చెప్పగలుగుతున్నాం. వైయస్సార్‌ గారు ప్రారంభించిన జలయజ్ఞం లోని అన్ని సాగునీటి ప్రాజెక్ట్‌లను త్వరితగతిన పూర్తి చేస్తున్నాం. హైటెక్‌ ముఖ్యమంత్రిగా చెప్పుకునే మేధావి చంద్రబాబు గారు వెలిగొండ ప్రాజెక్ట్‌ను  ఎందుకు పూర్తి చేయలేకపోయారు. 

  బాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కరువే. నారా చంద్రబాబు నాయుడు గారు, కరువు కవల పిల్లలే. ఆయన పాలనలో ప్రజల సంగతి దేవుడెరుగు, కనీసం జంతువులకు నీళ్లు తాగే పరిస్థితి కూడా లేదు. బాబు పాలనలో రైతాంగాన్ని పట్టించుకోకుండా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారు. 
-రైతుల గురించే కాకుండా కౌలు రైతుల గురించి కూడా మా ప్రభుత్వం పట్టించుకుంది. చంద్రబాబు తన అనుకూల మీడియాలో ప్రభుత్వంపై బురద చల్లేలా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చేతకాని చవట దద్దమ్మల్లా మీరు ప్రజలను నమ్ముకోకుండా, ఎంతసేపటికీ కుట్రలు, కుతంత్రాలు చేశారు.  చంద్రబాబు నాయుడు మరో జన్మ ఎత్తినా... వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఏమీ చేయలేరు. 

  చంద్రబాబుకు చేతనైనది ఎదుటవారిని మోసం చేయడమే. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎన్ని రుణాలు మాఫీ చేశారో చెప్పాలి. వ్యవసాయంపై.. ఎవరు ఏం చేశారో, అమరావతి, విశాఖ, తిరుపతి ఎక్కడైనా చర్చకు మేము సిద్ధం. 
-  ప్రతి దానిలో కమిషన్లు కొట్టేస్తూ, చెత్త పాలనతో ఏపీని సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడే? 
- ప్రకాశం జిల్లా నడివీధుల్లో మీరు చేసిందేంటో, మేము చేసిందేంటో చర్చించేందుకు మేము రెడీ. మీకు దమ్ముంటే రండి. కేంద్రం ఇచ్చిన నిధులను పసుపు-కుంకుమ అంటూ పంచిపెట్టలేదా? 
- 24 గంటలూ రాజకీయం, అధికారం కోసం తపించే చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు?
-  2024 ఎన్నికలకు వెళ్లినప్పుడు మేము ఏం చేశామో ప్రజలకు  ధైర్యంగా చెబుతాం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం.

Back to Top