తాడిపత్రి అభివృద్ధికి జేసీ ప్రభాకర్‌రెడ్డి అడ్డు

ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

అనంతపురం:  తాడిపత్రి అభివృద్ధికి టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అడ్డుతగులుతున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదస్పద వైఖరిని ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులకు జేసీ ఆటంకాలు సృష్టించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు చేయొద్దంటూ కాంట్రాక్టర్, సిబ్బందిని బెదిరించడం సరికాదన్నారు. గతంలో పోలీసు స్టేషన్‌ నిర్మాణ పనులు, కాలేజీ ప్రహరీ నిర్మాణ సమయంలోనూ ఇదే విధంగా వ్యవహరించారని తప్పుపట్టారు. తాడిపత్రి అభివృద్ధిని జేసీ ప్రభాకర్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.
 

Back to Top