మత్స్యపూరి ఘటనకు పవన్‌ బాధ్యత వహించాలి

భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌

పశ్చిమ గోదావరి: మత్స్యపూరి ఘటనకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పూర్తి బాధ్యత వహించాలని వైయస్‌ఆర్‌సీపీ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ డిమాండు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యపురిలో జనసేన కార్యకర్తలు అరాచకాలు సృష్టించారు.  జనసేన సర్పంచ్‌ ర్యాలీలో ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు.  దళితులపై దాడి చేసి, ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ సంఘటన స్థలాన్ని సందర్శించి, అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
 

Back to Top