ప్రభుత్వ భూముల అక్రమాలపై సభా సంఘం వేయాలి

ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
 

అమరావతి: ప్రభుత్వ భూముల అక్రమాలపై సభా సంఘం ఏర్పాటు చేయాలని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి డిమాండు చేశారు. పీలేరులో ప్రభుత్వ భూములు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. టీడీపీ నేతలు, అధికారులు కలిసి రికార్డులు తారుమారు చేశారన్నారు. పీలేరులో భూములు ఎకరా రూ.3, 4 కోట్లు పలుకుతుందని, దీనివెనుక రెవెన్యూ అధికారుల హస్తం ఉందన్నారు. అక్రమాలపై సభా సంఘం వేయాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కోరారు. 
 

తాజా వీడియోలు

Back to Top