రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సీఎం వైయస్‌ జగన్‌ శ్రమిస్తున్నారు

శంకర్‌నారాయణ
 

విజయనగరం:  పేదల గుండెల్లో ఇప్పటికే స్థానం సంపాదించుకున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నారని మంత్రి శంకర్‌నారాయణ పేర్కొన్నారు.  ఒక అభినవ అంబేద్కర్‌గా, అభినవ ఫూలేగా, బీసీ, ఎస్టీ, మైనారిటీ, ఎస్సీల పేద పిల్లల చదువులు మధ్యలో ఆగిపోకూడదనే ఉద్దేశంతో జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. గతంలో ఉన్న ప్రభుత్వాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను మభ్యపెట్టి ఐదేళ్లు కాలయాపన చేశారు. ఇవాళ బీసీ సంక్షేమ శాఖ ద్వారా రెట్టింపు మొత్తంలో పథకాలు అమలు చేస్తున్నాం. చంద్రబాబు గత ఐదేళ్లు రాష్ట్రంలోని పేదలను మోసం చేశారు. సహజ వనరులను చంద్రబాబు దోచుకున్నారు. అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ అవినీతి కార్యక్రమాలు చేస్తే..వాళ్లకు కులం పేరు అడ్డుపెట్టి కాపాడాలని చూస్తున్నారు. ప్రజలను మోసం చేసిన చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి. జగనన్న వసతి దీవెన పథకం గొప్పది. పేద ప్రజల తరఫున సీఎం వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
 

తాజా ఫోటోలు

Back to Top