అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు

 

మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 

 అనంతపురం:  అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ  చెప్పారు. ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని  తెలిపారు.  బుధవారం ఆయ‌న అనంత‌పురంలో మీడియాతో మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కచ్చితంగా కార్యాలయాల్లో ఉండాలని అన్నారు. పేదలకు 1.28 లక్షల ఇళ్లు అనంతపురం జిల్లాలో నిర్మిస్తున్నామని తెలిపారు.

Back to Top