విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీలోకి భారీ వలసలు కొనసాగుతున్నాయి.వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలు,సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై భారీసంఖ్యలో వివిధ పార్టీల నేతలు పార్టీలోకి చేరుతున్నారు. తాజాగా వైయస్‌ఆర్‌సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి బీసీ నేత కూరాడా నాగేశ్వరరావు చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు బీసీలకు అన్యాయం చేశారని, బీసీలకిచ్చిన ఏ ఒక్కహామీ అమలు కాలేదన్నారు. జగన్ సీఎం అయితేనే బీసీల సంక్షేమం సాధ్యమవుతుందన్నారు.