విభజన హామీలపై జీవీఎల్‌ చర్చకు రావాలి

 మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌  
 

విశాఖ: విభజన హామీలపై జీవీఎల్‌ చర్చకు రావాలని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సవాల్‌ విసిరారు. ఎంపీ జీవీఎల్‌ నరసింహాకు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చురకలంటించారు. విభజన హామీలపై జీవీఎల్‌కు అవగాహన ఉందా అని ప్రశ్నించారు.  స్టీల్‌ప్లాంట్‌కు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో జీవీఎల్‌ సమాధానం చెప్పాలన్నారు. ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియని వ్యక్తి జీవీఎల్‌ అని విమర్శించారు. జీవీఎల్‌ తెగిన గాలిపటం లాంటి వ్యక్తి అని ఎద్దేవా చేశారు.
 

Back to Top