24 గంటల్లో 94 మంది డిశ్చార్జ్‌..52 కరోనా పాజిటివ్‌ కేసులు

 మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,282

ఆసుపత్రుల్లో 705 మందికి చికిత్స

1,527 మంది డిశ్చార్జ్  

 తాడేపల్లి: ఏపీలో కరోనా అదుపులోకి వస్తోంది. రోజు రోజుకు కరోనా బాధితులు కోలుకొని ఇంటి బాట పడుతున్నారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 94 మంది కరోనా రోగులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, కొత్తగా 52 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.  గత 24 గంటల్లో 9,713 శాంపిళ్లను పరీక్షించగా మరో 52 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 94 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,282 అని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 705 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,527 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో మృతి చెందిన వారి సంఖ్య 50కి చేరింది.

రాష్ట్రంలో గత 24 గంటల్లో చిత్తూరులో 15, తూర్పుగోదావరిలో 5, కడపలో 2, కృష్ణాలో 15, కర్నూలులో 4, నెల్లూరులో 7, విశాఖపట్నంలో 1, విజయనగరంలో 1, పశ్చిమ గోదావరిలో 2 కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది.  
 

Back to Top