చిత్తూరులో వైయ‌స్ఆర్  విగ్ర‌హం ధ్వంసం

తిరుప‌తి:  చిత్తూరు జిల్లాలో  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాన్ని దుండ‌గులు ధ్వంసం చేశారు. ఈ ఘ‌ట‌న‌పై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళ‌న చేప‌ట్టారు. చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్‌పురం  మండల కార్యాలయం వద్ద ఉన్న వైయ‌స్ఆర్ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో నరికి ధ్వంసం చేశారు. విషయం తెలిసిన వెంటనే  ఆర్టీసీ వైస్ చైర్మన్  విజయానంద రెడ్డి, వైయ‌స్ఆర్‌ సీపీ కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top