తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్లుండి (21.02.2024) విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారిని ముఖ్యమంత్రి దర్శించుకోనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి చినముషిడివాడ చేరుకుంటారు, శ్రీ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.