పేదలకు వైద్యసాయం చేయడం లేదు


విశాఖ: రిటైర్డు హెచ్‌ఎం నరసింహరావు వైయస్‌ జగన్‌ను కలిసి తన సమస్యను చెప్పుకున్నారు. 2012 నుంచి క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నానని, ప్రభుత్వం నుంచి వైద్య ఖర్చుల నిమిత్తం ఎలాంటి సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు పెట్టినా రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదని తెలిపారు. మంత్రి యనమల రామకృష్ణుడి పంటి చికిత్సకు లక్షల రూపాయలు విడుదల చేసిన ప్రభుత్వం పేద ప్రజలకు మాత్రం వైద్యసాయం చేయడం లేదని విమర్శించారు. 

 
Back to Top