ప్రభుత్వం కాంట్రాక్టు వ్యవస్థను ప్రోత్సహిస్తుంది

కృష్ణా జిల్లా : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు  ఏళ్ల తరబడి కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న వారిని  క్రమబద్ధీ కరించాలని మచిలీపట్నానికి చెందిన ఈడే శివాజీ వైయ‌స్ జ‌గ‌న్‌ను కోరారు. ఈ మేర‌కు ఆయ‌న వినతిపత్రం అందజేశారు. వైయ‌స్ఆర్  హయాంలో సీఎల్‌గా విధులు నిర్వహించిన తమనందరినీ పర్మినెంట్‌ చేశారని, ఇప్పుడు ప్రభుత్వం కాంట్రాక్టు కార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తుందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తేనే కార్మికులకు  ప్రయోజనం కలుగుతుందని జననేతకు వివరిం చారు. ఆర్టీసీలో కాంట్రాక్టు విధానం రద్దు చేయాలని వైయ‌స్ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు.


Back to Top