<br/><br/><br/>కర్నూలు: వైయస్ జగన్ గెలుస్తాడు మాకు పింఛన్ వస్తుంది అని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గానికి చెందిన వృద్ధులు సుబ్బమ్మ, ఎల్లమ్మ, వెంకటమ్మలు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆదివారం పలువురు వృద్ధులు వైయస్ జగన్‌ను కలిసి పింఛన్ ఇప్పించాలని కోరారు. ఇందుకు స్పందించిన వైయస్ జగన్ మన ప్రభుత్వం వచ్చాక నెలకు రూ.2 వేల పింఛన్ ఇప్పిస్తానని మాట ఇవ్వడంతో వారి సంతోషానానికి అవధులు లేకుండా పోయాయి. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మాకు రూ.200 పింఛన్ మంజూరు అయ్యింది.మహానేత కొడుకు వైయస్ జగన్ ముఖ్యమంత్రి అ యితే రూ.2 వేలు చేస్తాడని పేర్కొంటున్నారు. <br/>