కనీసం హెల్త్‌కార్డు కూడా లేదన్నా..

వైయస్‌ జగన్‌కు హెల్త్‌ అసిస్టెంట్ల మొర..
శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో హెల్త్‌ అసిస్టెంట్లు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.కాంట్రాక్ట్‌ విధానంలో పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్‌ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఏ విధమైన సదుపాయాలు కల్పించడం లేదని జననేత దృష్టికి తీసుకెళ్ళారు.కనీసం హెల్త్‌కార్డులు కూడా మంజూరు చేయలేదని వాపోయారు.ఏళ్ల తరబడి పనిచేస్తున్నా వేతనాల పెంపు,ఉద్యోగాల భద్రత లేదన్నారు.2003 నుంచి కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నామన్నారు. వయోభారం పెరుగుతున్నా ఆరోగ్య  సదుపాయాలు కూడా ఈ ప్రభుత్వం కల్పించలేదన్నారు.వైయస్‌ జగన్‌ మా జీవితాల్లో వెలుగులు నింపుతారనే నమ్మకం ఉందన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top