నవ్వలేని జోకుతో నారా లోకేష్

 

వైఎస్ జగన్ కు భాస్కర్ అవార్డు ఇవ్వాలంటూ జోకేసాడు నారాలోకేష్. కానీ అదికాస్తా బూమరాంగ్ అయి లోకేష్ కే తగిలింది. అసలు అలాంటి అవార్డులు అందుకునే ఘనత ఎపిలో లోకేష్ కు తప్ప మరొకరికి లేదని తెలుగు ప్రజలంతా ఏకకంఠంతో చెబుతుండగా, చినబాబు మాత్రం ఆ క్రెడిట్ ను ఎవ్వరి మీదకో తోయాలనుకోవడం ఆయన త్యాగనిరతికి నిదర్శనం అంటున్నారు.

మానాన్నకు అంబాసిడర్ మాత్రమే ఉందన్న లోకేషన్ అభినయానికి ఏ అవార్డు ఇవ్వగలం.

ఆంధ్రప్రదేశ్ దేశాన్ని, కంపెనీలను ప్రపంచానికి పరిచయం చేసిన చినబాబుకు ఏ అవార్డు ఇస్తే బావుంటుంది.

వర్థంతికి శుభాకాంక్షలు చెప్పాలనే గొప్ప ఆలోచనాపరుడికి ఎలాంటి సత్కారం చేయాలి.

కులపిచ్చి, మత పిచ్చి ఉన్న పార్టీ టిడిపీయే అని నిజాలను నిర్భయంగా చెప్పిన లోకేష్ కు తప్పక అవార్డు ఇవ్వాలి.

వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించి కూడా, తమ పార్టీ నుంచి టిఆర్ఎస్లోకి ఫిరాయించిన వారిని గూర్చి గగ్గోలు పెట్టే మతిమరుపు గుణానికి కూడా ఏదో ఒక అవార్డు ఏర్పాటు చేసి మరీ ఇవ్వాలి.

ఇక ఆయన తండ్రిగారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబుగారికైతే నిత్యం ఓ అవార్డును, పూటకో పురస్కారాన్ని అందించే తీరాలి.

భర్త పేరు ప్లేసులో తండ్రి పేరురాసుకునే సుహాసినీ, బీకాంలో ఫిజిక్స్ చదివిన ఎమ్మెల్యే, పుట్టి పదేళ్లు కాకుండానే కోటీశ్వరుడైన దేశాంశ్, హరికృష్ణ మరణానికి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యే బాలయ్య వీరందరికీ అవార్డులు ఇచ్చాక ఇంకేమైనా మిగిలితే మిగిలిన వాళ్లకు ఇవ్వొచ్చు. కానీ రాష్ట్రం మొత్తం మీద నందమూరి, నారావారి కుటుంబాలు తప్ప అయోమయం అవార్డులు, అంధకారం పురస్కారాలు అందుకోడానికి ఎవరికీ అవకాశమే లేదు. భాస్కర్ అవార్డు ఇవ్వాల్సొస్తే ఈ రెండు కుటుంబాల పేర్లు తప్ప మరో పేరు పోటీకి రావడం అసాధ్యం. అన్యాయం కూడా. మరోసారి నారా లోకేష్ ఇలా నవ్వలేని జోకులేసి మరోసారి నవ్వుల పాలు కాకుండా ఉంటాడేమో చూద్దాం.

తాజా వీడియోలు

Back to Top