ఝూ మంతర్ కాళీ...ఇది జంతర్ మంతర్ మోళీ...మాయాలేదు మంత్రం లేదూ....యంత్రం లేదూ తంత్రం లేదు...మోసం గీసం మొదలే లేదు...ఇందరి ముందర ఇందర జాలం...చిందరవందర చిందుల మేళంగలాట గారడి గందర గోళంమాయలోడి ఈ పాట విని మూర్ఛపోవడమే ఇక మిగిలింది....రాజధానిలో భూములు తాకట్టు పెడతారట...ఆ సొమ్మును రాజధాని అభివృద్ధికే ఖర్చు పెడతారట...అదేంటో అప్పు పుట్టిన మర్నాడే బాబుగారు విదేశీ యాత్రలకు వెళతారట..అలా రమ్మంటూ ఆహ్వానాలు ఆటోమేటిక్ గా పుడతాయట...పాత అప్పు సొమ్ములు హాంఫట్ స్వాహా అవుతాయట...కొత్త అప్పుల కోసం జీవోలు విడుదలౌతాయట...అమరావతి బాండ్ల రెండువేల కోట్లు...అమెరికా సదస్సు పేరుతో రెక్కలుగట్టుకు వెళ్లిపోయాయి...ఇప్పుడు భూములు బాంకుల తాకట్టుకు చేరివచ్చే 10,000 కోట్లు ఏ సింగపూరుకు తరలనున్నాయో...మాయ...మాయ అంతా మాయా...ఛాయా ఛాయా అంతా చంద్ర ఛాయ..ఆ చీకటి నీడలో బాబు అవినీతి చక్రవర్తి...తాకట్టు కనికట్టుల జాదూలో ప్రజలకు కన్నీళ్లే ప్రాప్తి..