తన పాలన ఎలా వుందో తెలుసుకోవాలని మారువేషంలో చంద్రబాబు ఒక అర్థరాత్రి పర్యటనకి బయలుదేరాడు వెంట పిఏ వున్నాడు. ఒక చోట భార్యభర్తలు గొడవ పడుతున్నారు ఉన్న డబ్బులన్నీ తాగేశాడని భార్య అరుస్తూవుంది. ఆమె పై భర్త వీరంగం వేస్తున్నాడు. చంద్రబాబు కలగచేసుకుని `` చంద్రబాబు లాంటి గొప్పవ్యక్తి పాలనలో ఇలా తాగి తందనాలు ఆడుతావా ? `` అని భర్తను మందలించాడు. భర్త ఎగాదిగా చూసి `` తమరెవురు బాబయా `` అని అడిగాడు. `` ఆయనో బాటసారి `` అని పిఏ చెప్పాడు. ``నువ్వేమైనా ఆయన పిఏవా ? ఆయనకి నోరు లేదా ? `` `` నేనో బాటసారిని `` చెప్పాడు బాబు. `` నేనో బ్రాందిసారిని. మీరు రోడ్డుపైన నడుస్తారు. నేను మందుపై నడుస్తా. చంద్రబాబుని గొప్పవ్యక్తి అన్నారు. నిజమే ఆయన మాట మాకు వేదవాక్కు. ఆయన ఏమన్నాడు ? విదేశాల్లో భార్యభర్తలు కొట్లాడితే ఒక పెగ్గుతాగుతారు. అదే మన రాష్ట్రంలో అయితే ఫుల్లు తాగుతారు అన్నాడా లేదా ? ముఖ్యమంత్రే చెబితే వినాలా వద్దా ?అందుకే ఆయన మాటకి గౌరవమిచ్చి ఫుల్లుతాగేశా `` `` తాగడం మానేసి మొక్కలు నాట వచ్చుగా`` అన్నాడు బాబు `` ఏంటీ తాగడం మానేయాలా ?`` అంటూ తాగుబోతు ఒక కర్రని తీసుకుని పిచ్చి పిచ్చిగా నవ్వుతూ వెంటపడ్డాడు. చంద్రబాబు, పిఏ దూరంగా వెళ్లి నిలబడ్డారు. `` తాగడం మానేస్తే పిచ్చోళ్ళయిపోతారని మా చంద్రబాబే చెప్పాడు. పిచ్చోడిగా బతకడం కంటే తాగుబోతుగా జీవించడం మేలు కదా `` `` ఇంతకాలం జనం మీ మాటల్ని నమ్మరని అనుకున్నాను కానీ మీ మాటల్ని విశ్వసించే వర్గం కూడా వుందని అర్థమైంది సార్ `` అన్నాడు పిఏ `` తాగుబోతులు మాటపైన నిలబడరని అంటారు. కానీ వీడు నా మాటమీద నిలబడడం గర్వంగా వుంది`` అన్నాడు బాబు `` అయినా వాళ్లెంత తాగితే మనకంత ఆదాయం. వాళ్ళ జోలికెందుకు వెళతారు మీరు .`` ఆ తరువాత డ్వాక్రా మహిళా సంఘం దగ్గరికెళ్ళారు. `` చంద్రబాబు రుణమాఫీ వల్ల మీకు బాగా లాభం కలిగిందా ? `` అని పిఏ అడిగాడు. `` లాభం గూబల్లోకి వచ్చింది. ఆయన్ని నమ్మడం వల్ల పుస్తెలు అమ్ముకుని పస్తులుంటున్నాం `` అని చెప్పిందో మహిళ`` బాబంటే ఎవరకున్నావు. మాట తప్పేవాడు కాదు `` అన్నాడు చంద్రబాబు `` మీది పరాయిదేశమా బాబూ ?`` `` కాదు, ఈ రాష్ట్రమే `` `` బాబు మాటమీద నిలబడతాడని నమ్ముతున్నాడంటే నీది ఖచ్చితంగా ఈ రాష్ట్రం కాదు. ఎందుకంటే చంద్రబాబు ఏది చెప్పినా చేయడు `` ``సార్, ఇక్కడ కూడా కథ అడ్డం తిరుగుతూ వుంది. వెలదామా? ``అన్నాడు పిఏఈ సారి ఒక రైతు దగ్గరికి వెళ్ళారు `` చంద్రబాబు హయాం ఎలా వుంది ? `` అడిగాడు పిఏ `` గతంలో ఎట్లావుందో, ఈ సారి కూడా అట్లానే వుంది `` చెప్పాడు రైతు `` రుణమాఫీ జరిగిందా ?`` `` మాఫీ కాదు, ఓట్లేసిన వారికి తగిన శాస్తి జరిగింది `` `` మీ అబ్బాయికి జాబొచ్చిందా?`` `` మా వూళ్ళోటిడిపి నాయకులకి జీపులొచ్చాయి``రైతు ఒక కర్ర తీసుకున్నాడు. `` ఆయనెవరో తెలుసా ?`` అని అడిగాడు పిఏ `` తెలుసు, చంద్రబాబు `` `` మారువేషంలో వున్న ఎలా గుర్తు పట్టావ్ `` `` ఆయన మా దగ్గర ఎన్ని వేషాలు వేసినా, ఆయన్ని రైతులు మొదట కనిపెడతారు `` అని కర్రతో తరుముకున్నాడు.