భేతాళ కథ

పట్టు వదలని విక్రమార్కుడు మళ్లీ చెట్టు దగ్గరకు వచ్చి వేలాడుతోన్న శవాన్ని భుజాలకెత్తుకుని నడవడం ఆరంభించాడు.శవంలోని భేతాళుడు అలారం పెట్టుకున్నట్లు హఠాత్తుగా లేచి...విక్రమార్కుడిపై చికాకు పడ్డాడు.ఇంకా ఇలా భుజాలమీద మోయడమేంటి రాజా...ఏదో ఒక వెహికల్ కొనక అని విసుక్కున్నాడు. దానికి విక్రమార్కుడు కొంచెం సిగ్గు పడ్డా..అంతలోనే తేరుకుని  లోన్ కి అప్లయ్ చేశాను భేతాళా వచ్చేసారికి కారు వచ్చేస్తుందని బదులిచ్చాడు. దానికి సంతృప్తిచెందిన భేతాళుడు.. చూడు విక్రమార్కా..ఇపుడో కథ చెబుతాను. సావధానంగా విని  ఆ తర్వాత నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్దువుగాని అని కథ చెప్పడం మొదలు  పెట్టాడు.

జంబూక ద్వీపం..భరత ఖండంలో...ఆంధ్రప్రదేశరాజ్యం ఉంది.పేరుకే రాజ్యంకానీ...రాజరికాలు పోయాయి.ప్రజాస్వామ్య ప్రభుత్వం అక్కడ కొలువు తీరి ఉంది. ఆ రాజ్యానికి రాజులాంటి వాడు నారా చంద్రబాబు నాయుడు. ఆయన్నే సిఎం అంటారు.ఆయన పాలనలో భూమా నాగిరెడ్డి అనే ఓ ఎమ్మెల్యేపై ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ పోలీసు అధికారి చేయి చేసుకోబోయాడు.ఒంటిమీద చేయి వేయద్దు ప్లీజ్ అంటూ భూమా వెనక్కి జరిగారు. ఈ విషయం చంద్రబాబుకు తెలిసింది. ఆయన చాలా సీరియస్ అయిపోయారు.అంతే భూమా   ఒక సామాజిక వర్గాన్ని అవమానించారని చెప్పి గుర్తుకొచ్చిన సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టి ఆయన్ను జైలుకు పంపారు.
చట్టం ముందు అందరూ తనకు సమానమే అని చంద్రబాబు అపుడు స్పష్టం చేశారు.

ఇలా న్యాయం కాపాడి ఆయన తన రాజ్యాన్ని అభివృద్ధి చేసి పెట్టమని అడగడానికి జపాన్ వెళ్లారు. జపాన్ పాలకులను..అక్కడి వ్యాపారులను బతిమాలాడి మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండని అడిగారు.వారు వెంటనే ఒప్పేసుకున్నారు.అలా ఆయన జపాన్ లో ఉండగానే ఆంధ్ర రాజ్యంలో మరో ఘటన చోటు చేసుకుంది.
ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతోన్న  అక్రమార్కుల ఆటలు కట్టించాలని వనజాక్షి అనే  మహిళా తహసిల్ దార్ హుటాహుటిన ఇసుక  ర్యాంపుల వద్దకు వెళ్లి దుండగుల అక్రమ తవ్వకాలను ఆపాల్సిందిగా ఆదేశించారు.

అంతే ఇసుకదొంగలకు నాయకత్వం వహిస్తోన్న చింతమనేని అనే ఎమ్మెల్యేకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఎన్నికల్లో గెలవడానికి కోట్లకు కోట్లు ఖర్చు చేసి..ఇపుడా డబ్బులు వెనక్కి రాబట్టుకోడానికి ఇసుక తవ్వుకుంటోంటే..ఈ అధికారి ఎవరూ అడ్డుకోడానికీ అని  కోపం కట్టలు తెంచుకుంది. మహిళా అధికారి అని కూడా చూడకుండా వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని చేయి చేసుకుని ..సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే స్థాయి బూతులు తిడుతూ అవమానించారు.

ఈ విషయం కూడా అలా అలా చంద్రబాబు నాయుడికి తెలిసింది. అప్పటికే ఆయన జపాన్ నుంచి ఢిల్లీ వచ్చి...తన సొంత ఇబ్బందులు  తీర్చుకోడానికి  వివిధ కేంద్రమంత్రులను బతిమాలాడుతోన్న తరుణంలోనే ఈ వార్త తెలిసింది. ఆయనకు  బాగా కోపం వచ్చింది. బాగా సీరియస్ అయిపోయారు.అయితే ఆయన సీరియస్ అయ్యింది దాడి చేసిన చింతమనేని పై కాదు. చింతమనేని దాడిలో అవమానానికి గురై విలపిస్తోనన బాధితురాలు వనజాక్షిపైనే చంద్రబాబు సీరియస్ అయ్యారు.హైదరాబాద్ రాగానే ఆమెను పిలిపించుకుని ఇసుక ర్యాంప్ దగ్గర నీకేం పని అని మందలించారు. మీడియా తో ఇంకేమీ మాట్లాడకుండా వెళ్లిపో అని ఆదేశించారు.

ఇదీ కథ. రాజా ఇపుడు చెప్పు..భూమా విషయంలో  ..భూమా ఏమీ అనకపోయినా..ఆయనపై కేసులు పెట్టించి అరెస్ట్ చేయించిన చంద్రబాబు...
మరో ఎమ్మెల్యే చింతమనేని దారుణంగా దాడి చేస్తే..ఆయనపై చర్యలు తీసుకోవలసింది పోయి...బాధితురాలికే అల్టిమేటం ఇచ్చి పంపించడానికి కారణం ఏంటి? దీనికి సమాధానం తెలిసీ కూడా చెప్పకపోతే నీ తల వెయ్యి చెక్కలైపోతుంది అని భేతాళుడు  అన్నాడు.

విక్రమార్కుడు బాగా ఆలోచించాడు.భేతాళా ...కథలో భూమా నాగిరెడ్డి చంద్రబాబు పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.అంచేత భూమా తప్పు చేయకపోయినా జైల్లో పెట్టించడమే క్షుద్ర రాజకీయ ధర్మం. అదే చింతమనేని విషయాన్ని తీసుకుంటే..ఆయన చేసింది పరమ దుర్మార్గం..పరమ నీచం ..అయినప్పటికీ చంద్రబాబు సొంత పార్టీ అయిన టిడిపికి చెందిన ఎమ్మెల్యే. చింతమనేనిపై యాక్షన్ తీసుకుంటే పార్టీ పరువు..ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటాయి. అదీ కాకుండా ఇసుక అక్రమతవ్వకాలన్నీ కూడా చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతున్నాయి కాబట్టి...చింతమనేని పై చర్యలు తీసుకుంటే ఆయన రేవంత్ రెడ్డిలా మా బాస్  చంద్రబాబే అనే ప్రమాదం ఉంది. అందుకే  ధర్మాధర్మాలు ఆలోచించిన చంద్రబాబు చింతమనేనిని వదిలి వనజాక్షిని హెచ్చరించారు.భూమాను జైలకు పంపి అధికారులను ఎంకరేజ్ చేశారు. అని విక్రమార్కుడు విశ్లేషించి చెప్పాడు. విక్రమార్కుని సమాధానం సంతృప్తి పర్చగానే విక్రమార్కుడి భుజాలమీది శవం మాయమై తిరిగి చెట్టుకొమ్మకు వేలాడింది.

-కవికాకి

Back to Top