కాకిలెక్కలు

చంద్రబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసాడు
భాగస్వామ్యసదస్సు అదిరిపోయింది. రాష్ట్రమంతా పరిశ్రమలు, ఉద్యోగాలే అన్నాడు బాబు
మొత్తం మీద కాకి లెక్కలతో అదరగొట్టేశారు అన్నారు విలేకరులు
కాకి లెక్కలేంటి?22లక్షల మందికి ఉద్యోగాలొస్తుంటే?
ఇంతకాలం మీ మామ ఎన్టీయారే అద్భుతమైన నటుడనుకున్నాం కానీ, మీరు ఇంకా గొప్ప నటులు సార్
ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే అందరూ అసూయపడి నా మీద నిందలేస్తున్నారు
నిందలు కాదు, లెక్కలు చెప్పండి చూద్దాం
మొత్తం కుదిరిన ఒప్పందాలు 665
ఈ మొత్తం పరిశ్రమలుగా మారాయని అనుకుంటే ఒక్కో పరిశ్రమ మూడున్నరవేల ఉపాధి కల్పిస్తే అప్పుడు మీరు చెప్పే 22లక్షల ఉద్యోగాలు వస్తాయి
అవును డెఫినెట్ గా వస్తాయి
ఎలా వస్తాయి?మీరు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థల్లో సగం తలాతోక లేని సంస్థలు
వచ్చిన వాళ్లను కాదనగలమా?
దొంగలందర్నీ ఆహ్వానించండి. వారు భూముల్ని తినేసి ప్రజలకి టోపీ పెట్టి వెళ్లిపోతారు
ఇకపోతే 9 ప్రయివేట్ యూనివర్శిటీలు వస్తాయంటున్నారు. అక్కడేం చదువులుంటాయి
అవన్నీ ప్రపంచస్థాయి యూనివర్శిటీలు
ప్రపంచంలో ఎక్కడో ఒకచోట వుండే యూనివర్శిటీలు అని చెప్పండి అంతేకానీ ప్రపంచస్థాయి అనకండి. ప్రపంచస్థాయి యూనివర్శిటీలు మీరు పిలవగానే వచ్చేసి యూనివర్శిటీలు పెట్టవు. ఇంకో విషయం 16,705 కోట్లతో ఏర్పాటయ్యే ఈ వర్శిటీల్లో లక్షన్నరమందికి ఉద్యోగాలొస్తాయని మీ మీడియాలో రాసారు. ప్రయివేట్ యూనివర్శిటీల్లో ఒక్కోచోట 15వేల మంది ఉద్యోగులు ఎక్కడైనా ఉంటారా?మీవన్నీ తప్పుడు లెక్కలు
మీరు అభివృద్ధి నిరోధకులు అన్నాడు బాబు కోపంగా
అభివృద్ధి అంటే అందరికీ ఇష్టమే. కానీ మట్టిగుర్రాన్ని చూపించి నీళ్లలోకి దిగమంటున్నారు. మూడేళ్ల నుంచి విదేశాలన్నీ తిరుగుతూ కబుర్లు చెబుతున్నారు. ఒక్క పరిశ్రమ వచ్చిందా?అమరావతి కట్టేశారా?పొలాలకు నీళ్లొచ్చాయా?ఏమీ జరగకుండా అన్నీ జరిగినట్టే చెబుతున్నారు
2050 నాటికి ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచగమ్యస్థానంగా మారుస్తాం.
3000 సంవత్సరం నాటికి ప్రపంచంలో అగ్రరాష్ట్రంగా కూడ మార్చగలరు. మాటలే కదా, పోయేదేముంది?
రాష్ట్రాన్ని దావోస్ గా మారుస్తా
దావోస్ కాదుకనీ దివాళా తీయించడం ఖాయం

తాజా వీడియోలు

Back to Top