అక్కరకురాని ఇంజనీర్లు

దేశాభివృద్ధిలో ఇంజనీర్లే కీలకం అని నొక్కి వక్కాణిస్తున్నారు ఐటి శాఖా మంత్రి లోకేష్. ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన మంత్రి ఇలా తన సువర్ణాభిప్రాయాన్ని ప్రకటించారు. మరి ఇదే భారతీయ ఇంజనీర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు అవమానించినప్పుడే రత్నంలాంటి పుత్రరత్నం ఈమాటెందుకు అనలేదా అనుకుంటుంన్నారు దేశీయ, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ఇంజనీర్లు. అమరావతి నిర్మాణానికి లండన్, జపాన్, సింగపూరు సంస్థలను పిలిచి వారికి కోట్ల రూపాయిలు డిజైన్ల కోసమే ఖర్చుపెట్టిన ఘనమైన ముఖ్యమంత్రి చంద్రబాబుగారికి, నేడు భారతీయ ఇంజనీర్లను తెగ పొగుడుతున్న మంత్రి నారా లోకేష్ కు అప్పుడు వారెందుకు గుర్తుకు రాలేదో మరి! ప్రపంచ స్థాయి రాజధాని కోసం ప్రపంచం లోని ప్రముఖ సంస్థలు మాత్రమే కావాలని బాబగారి ఆలోచన. 
మరైతే రాష్ట్రంలోని ప్రాజెక్టుల కాంట్రాక్టులన్నీ మాత్రం తెలుగు తమ్ముళ్లకే ఎలా పట్టం కట్టారో చెప్పాల్సిన అవసరం ఉంది. వీటిని కూడా ఏ జపాన్ సంస్థకో, లండన్ కంపెనీకో కట్టబెట్టాల్సింది కదా!! కాంట్రాక్టులు అప్పజెప్పడానికి, అధిక ధరలు కోట్ చేసినా ఒప్పుకోవడానికి, అంచనాల పెంపుకకు, అధిక చెల్లింపులకూ మాత్రం తెలుగు తమ్ముళ్లే కావాలి. కానీ అమరావతి నిర్మాణానికి మాత్రం తెలుగు ఇంజనీర్లు పనికిరారు. ఇదీ బాబుగారి స్వజాతి న్యాయం. స్వసమూహ సహకారం. ఆయన గారు పొగుడుకుంటున్నట్టు ప్రపంచంలో ఎక్కడైనా తెలుగు మేధావులు ఉంటారు కానీ, సొంత రాష్ట్రంలో వారి విలువకు గుర్తింపు లేదు. ప్రతిభకు ప్రోత్సాహం ఉండదు. బాబుగారు గొప్పలు చెప్పుకోడానికి విదేశీ కావాలి. కమీషన్లు పుచ్చుకోడానికి దేశీ అదేనండి తెలుగుదేశీ నాయకుల బినామీ కాంట్రాక్టర్లు కావాలి. ఇదే బాబుగారి అభివృద్ధి సూత్రం. 

 
Back to Top