అది నేనే...ఇది నేనే


భాగ్యనగరాన్ని బాబుగారే నిర్మించారు. 
చార్మినార్ కు చంద్రబాబే శంకుస్థాపన చేసారు.
గోల్కొండ కోట నిజానికి నారా కోట దయాధర్మంగా హైదరాబాద్ నవాబులకు రాసిచ్చేసారు.
మూసీనది ముఖం కడుక్కోడానికి, టాంకుబండు దూకి ఈతకొట్టడానికి బాబే కట్టాడు...
బిర్లామందిర్ బనాయించింది బాబే...
ఫలక్ నామా పాలెస్ పునాదిరాయి బాబేసిందే...
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ , కాచీగూడా రైల్వేస్టేషన్లు కట్టింది బాబే..
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఔటర్ రింగు రోడ్డు, మెట్రోరైలు ప్రతిదీ బాబు ఘనతే...
ఆట్టే ఆక్షేపిస్తే అసలు హైదరాబాద్ కు ఆ పేరు పెట్టిందే చంద్రాబు...చూసారా నవాబుల్లో ఒకడన్నమాట...
పిచ్చి ముదిరితే ఎవరైనా రోకలి తలకు కట్టమంటారు...బాబు మాత్రం హైదరాబాద్ ను నా జడలో పెట్టండి అంటాడు. 
అన్నీ చేసింది నేనే...అంతా చేసింది నేనే అనే బాబుకు ఉన్న ఈ వ్యాధిపేరేమిటో ప్రపంచంలో ఏడాక్టరూ కనిపెట్టలేకపోతున్నాడు.  అదేమిటో మీకైనా తెలుసా!!
తెలిస్తే అమరావతిలో ఎర్రగడ్డ లేదుగనుక భ్రమరావతిలో కాట్రగడ్డకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించ ప్రార్థన. 
 
Back to Top