రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో వైయస్‌ఆర్‌

విశాఖలో వైయస్‌ఆర్‌ జయంతి వేడుకల్లో వైవీ సుబ్బారెడ్డి

విశాఖ:  దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్నారని వైయస్‌ఆర్‌సీపీ రీజినల్‌ కో–ఆర్డినేటర్, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. విశాఖలోని వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో వైయస్‌ఆర్‌ 74వ జయంతి వేడుకలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి కేక్‌ కట్‌ చేశారు. వైయస్‌ఆర్‌ అభిమానులు రక్తదానం చేశారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌కు సమానంగా విశాఖను వైయస్‌ రాజశేఖరరెడ్డి అభివృద్ధి చేశారని వైవీ సుబ్బారెడ్డి కొనియాడారు. తండ్రి అడుగు జాడల్లోనే సీఎం వైయస్‌ జగన్‌ విశాఖను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన కూడా చేయని విధంగా దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు. మరీ ముఖ్యంగా విశాఖ నగర అభివృద్ధికి ఆలోచన చేసి హైదరాబాద్‌కు ధీటుగా తీర్చిదిద్దారన్నారు. ఆయన ఆలోచనలో నుంచి వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలే ఈ రోజు విశాఖ అభివృద్ధికి దోహదపడ్డాయని తెలిపారు.

పులివెందులలో..
మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు పులివెందులలో ఘనంగా నిర్వహించారు. పులివెందుల కూడలిలోని వైయస్‌ఆర్‌ విగ్రహానికి ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. రైతుల పక్షపాతి అయిన వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. వైయస్‌ఆర్‌ సీఎం అయిన తరువాత మొట్ట మొదటి సంతకం రైతులకు ఉచిత విద్యుత్‌ ఫైల్‌ పైనే చేశారని గుర్తు చేశారు. 
 

Back to Top