క‌దం తొక్కిన యువ‌త‌

వైయ‌స్ఆర్‌సీపీ యువ‌త పోరు విజ‌య‌వంతం

 జిల్లా క‌లెక్ట‌రేట్ల వ‌ర‌కు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌

అధికారుల‌కు విన‌తిప‌త్రం అంద‌జేత‌

తాడేప‌ల్లి: ఏపీలో విద్యార్థులు, వారి తల్లితండ్రులు.. నిరుద్యోగుల పక్షాన అన్ని జిల్లాల్లో వైయ‌స్ఆర్‌సీపీ తలపెట్టిన ‘యువత పోరు’ కార్యక్రమం విజ‌య‌వంత‌మైంది. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కేంద్రాల్లో విద్యార్థులు, వారి తల్లుతండ్రులు, నిరుద్యోగులతో కలిసి కలెక్టర్‌ కార్యాలయాల వరకు వైయ‌స్ఆర్‌సీపీ భారీ ర్యాలీలు నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలని.. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని.. కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకుని, పేదలకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలని కోరుతూ విద్యార్థులు కదం తొక్కారు. అనంత‌రం కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు అందజేశారు.

నిరుద్యోగ భృతి ఊసేలేదు:  మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి
 
కూటమి ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చిందని, ఇంతవరకూ ఆ ఊసే లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. సమున్నత ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం నీరుగారుస్తోందని, బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ఏడాది తల్లికి వందనంను ఎగ్గొట్టారని, వచ్చే ఏడాది నుంచి ఇస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో విద్యారంగం ఎంతో పటిష్టంగా తయారైందని చెప్పారు. నెల్లూరులో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ‘యువత పోరు’ కార్యక్రమం విజ‌య‌వంత‌మైంది. వీఆర్ కళాశాల సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ కొనసాగింది.ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… ‘సమున్నత ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం నీరుగారుస్తోంది. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూడా ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోంది. నిరుద్యోగులకు భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చారు, ఇంతవరకూ ఆ ఊసే లేదు. ఈ ఏడాది తల్లికి వందనాన్ని ఎగ్గొట్టారు, వచ్చే ఏడాది నుంచి ఇస్తామని చెబుతున్నారు. బడ్జెట్లో రూ.8 వేల కోట్లను మాత్రమే కేటాయించారు. ఈ పథకానికి రూ.16వేల కోట్ల నిధులు అవసరమవుతాయి. విద్యా రంగాన్ని సీఎం చంద్రబాబు దెబ్బ తీస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో విద్యారంగం ఎంతో పటిష్టంగా తయారైంది. నాడు-నేడుతో పాఠశాలలకు కొత్త రూపును మాజీ సీఎం వైయ‌స్ జగన్ తీసుకువచ్చారు’ అని అన్నారు.

క‌ర్నూలులో..
వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో క‌ర్నూలులో చేప‌ట్టిన యువ‌త పోరు కార్య‌క్ర‌మంలో విద్యార్థులు, యువ‌త అధిక సంఖ్య‌లో పాల్గొన్నారు. కర్నూలు కలెక్టరేట్ ముందు వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఫీజు పోరు ఆందోళన చేపట్టారు. గౌరీ గోపాల్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని.. నిరుద్యోగ భృతి హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీదేవి, సాయి ప్రసాద్ రెడ్డి, కోడుమూరు సమన్వయకర్త ఆదిమూలపు సతీష్ తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల జిల్లా..
నంద్యాలలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫీజు పోరు కార్యక్రమం దద్దరిల్లింది.
జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ
సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు..
 కూటమి ప్రభుత్వం యువతకు అబద్దపు హామీలు ఇచ్చి మోసం చేసింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి విమ‌ర్శించారు.  కూటమి ప్రభుత్వం పెండింగ్ ఉన్న ఫీజు రియింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాల‌ని ఆయ‌న డిమాండు చేశారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి..
పేద విద్యార్థులకు ఉచిత విద్య, వైద్యాన్ని అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.

ప్రకాశం జిల్లా ..
పేద ఇంట్లో పుట్టిన ప్రతి పేదవాడు ఉన్నత చదువులు చదివేందుకు వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ పార్ల‌మెంట్ ఇన్‌చార్జ్ చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి మండ‌ప‌డ్డారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు  ఫీజు రియింబర్స్‌మెంట్ ఇవ్వటం లేదు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించటం లేదు.పేద విద్యార్థులకు వసతి గృహాలలో నాణ్యమైన భోజనం అందించటం లేదు. 
పేద విద్యార్థులు వేధించకుండా తక్షణమే నిధులు విడుదల చేయాలి
పేదలు, విద్యార్థులు ,యువతపక్షాన పోరాటం చేస్తూనే ఉంటామ‌ని చెవిరెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. `విద్యాశాఖ మంత్రి లోకేష్ విదేశాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.యువకులకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను కూటమి మోసం చేస్తుంది.
ఎన్నికలలో నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చారు. 
ఇప్పుడు నిరుద్యోగ భృతి యువతకు ఇచ్చిన హామీ ఏమైంది?.
బడ్జెట్ లో నిరుద్యోగ భృతి  కోసం ఒక రూపాయి కూడా కేటాయించలేదు..
పది నెలల్లో కూటమి ప్రభుత్వానికి అన్ని రంగాలలో వ్యతిరేకత పెరిగింది  
మార్కాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి.
కూటమి అందర్నీ మోసం చేసింది..

గుంటూరులో..
వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో గుంటూరులో నిర్వ‌హించిన యువ‌త పోరు కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న ల‌భించింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసింది
ప్రజలను మోసం చేసినందుకు చంద్రబాబుపై 420 కింద కేసు నమోదు చేయాలి
యువత పోరు నిరసన కార్యక్రమంలో భారీ స్థాయిలో విద్యార్థులు నిరుద్యోగులు వారి తల్లిదండ్రులు పాల్గొని నిరసన తెలిపారు
రాష్ట్రవ్యాప్తంగా యువత పోరు నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు
రాష్ట్రంలో పోలీస్ పాలన కొనసాగుతోంది
లోకేష్ రెడ్ బుక్ పాలనకు మా ఇంట్లో కుక్క కూడా భయపడదు

విశాఖ..

యువత పోరు కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు..
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..మూడు ప్రధాన డిమాండ్లతో వినతిపత్రం ఇచ్చాం..
ప్రభుత్వం హామీలు ఇచ్చి విస్మరించడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం..
యువతకు ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్‌లో కేటాయింపులు లేవు..
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు వచ్చాయి అంటే అది వైయ‌స్ జగన్ గారి కృషి..
మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలి..
బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు.. ఇప్పుడు మోసం గ్యారంటీ అన్నట్టు ఉంది..
మా పార్టీ ఆవిర్భావం నాడు ప్రజల సమస్యలపై పోరాడుతున్నాం..
రానున్న రోజుల్లో ప్రజల పక్షాన పోరాటం చేస్తాం..
ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకూ పోరాడుతాం..
 

రీజనల్ కో ఆర్డినేటర్ కన్నబాబు మాట్లాడుతూ..

  • యువత పోరు కార్యక్రమాన్ని పోలీసుల ద్వారా ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది..
  • ప్రజా పోరాటాలు చూసి చంద్రబాబు ఎందుకు వణికిపోతున్నాడు..
  • కూటమి ఇచ్చిన హామీలు వారి గెలుపు కోసం ఇచ్చినవి.. ప్రజల మంచి కోసం కాదు..
  • 10 నెలలు గడవక ముందే వైయ‌స్ఆర్‌సీపీ పిలుపు ఇస్తే ఇంత మంది ఎందుకు రోడ్ల మీదకు వస్తున్నారో ఆలోచించాలి..
  • జగన్ గారి హయాంలో విద్యార్థులకు అనేక పథకాలు అందించాం..
  • విద్యార్థులకు హాల్ టికెట్స్ వస్తాయో రావో తెలియని పరిస్థితి నెలకొంది..
  • ప్రభుత్వ పరిధిలో మెడికల్ కాలేజీలను జగన్ తీసుకొస్తే సిగ్గు లేకుండా బాబు వాటిని అమ్మాలని చూస్తున్నాడు..
  • మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారికి కట్టబెట్టే ఆలోచన పెద్ద స్కాం.
  • ప్రైవేట్ వ్యక్తులకు కొమ్ము కాయడమే చంద్రబాబు పాలన..
  • విద్య, వైద్య రంగంలో ఉన్న రూ. 4 వేల కోట్లు బకాయిలు కూడా చెల్లించలేరా?.  
  • తెచ్చిన అప్పులు ఏం చేశారు..
  • రాష్ట్రంలో లోకేష్ రాసిన రాజ్యాంగం అమలు చేస్తున్నారు..
  • ప్రభుత్వ చేతకానితనం వలన పోరాటానికి భయపడుతుంది..
  • చంద్రబాబు ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్షం వైయ‌స్ఆర్‌సీపీనే..
  • ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డే అని తెలియజేస్తున్నా..
  • ఎన్ని ఆంక్షలు పెట్టినా.. ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది..
  • కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు..
  • 10 లక్షల కోట్లు అప్పులని అన్నారు.. అసెంబ్లీ సాక్షిగా నిజం బయటపడింది..
  • తండ్రి అబద్దాలకోరు అయితే.. లోకేష్ ఏమవుతాడు?.
  • ఇన్ని అప్పులు చేసినా.. ప్రభుత్వం విద్య, వైద్య రంగంలో ఉన్న బకాయిలను ఎందుకు తీర్చలేదు?

యువత పోరును అడ్డుకున్న పోలీసులు..

విజయవాడలో యువత పోరుకు అడ్డంకులు.
వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు.
యవత పోరుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు.
వైయ‌స్ఆర్‌సీపీ నేతల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.
ర్యాలీకి అనుమతి లేదని బారికేడ్లు ఏర్పాటు. 
వైయ‌స్ఆర్‌సీపీ యువత పోరును అడ్డుకుంటున్న పోలీసులు

కృష్ణాజిల్లా..
కృష్ణా జిల్లాలో నిర్వ‌హించిన యువ‌త పోరు కార్య‌క్ర‌మం ద‌ద్ద‌రిల్లింది. కూటమి ప్రభుత్వం తీరును మాజీ మంత్రి పేర్ని నాని ఎండ‌గ‌ట్టారు. చంద్రబాబు, పవన్, బీజేపీ కలిసి ప్రజలను మోసం చేశారు
పార్టీ పెట్టిన ఎన్టీఆర్‌ను, ఓటేసిన ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు
మీ ఖర్చులకు డబ్బులుంటాయి కానీ.. విద్యార్ధుల ఫీజులకు డబ్బులుండవా?.
చంద్రబాబు, పవన్, లోకేష్‌కు పదేసి కార్లలో తిరగడానికి.. వాటి సిబ్బందికి డబ్బులుంటాయి
పిల్లలకు ఫీజుల బకాయిలు చెల్లించడానికి మనసు రాదా
ఎన్ని ఆంక్షలు పెట్టినా కూటమి ప్రభుత్వంపై మా పోరాటం కొనసాగుతుంది
అరెస్టులతో మమ్మల్ని అడ్డుకోలేరు
అరెస్టులు చేసి వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలతో జైళ్లను నింపుకున్నా మేం వెనకడుగువేసేది లేదు

శ్రీకాకుళం..

యువత పోరు కార్యక్రమానికి వెళుతున్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
జిల్లా కేంద్రానికి వస్తున్న ఆముదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ చింతాడ రవికుమార్, నేతలను  అడ్డుకున్న పోలీసులు.
రోడ్డుపై బైఠాయించిన వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ నాయకులు
చింతాడ వద్ద పోలీసులకు, నేతలకు మధ్య వాగ్వాదం
అనంతరం, వైయ‌స్ఆర్‌సీపీ నేతలకు అడ్డుతప్పుకున్న పోలీసులు. 

విశాఖలో ఉద్రిక్తత..

విశాఖ జిల్లా కలెక్టరేట్‌కు భారీగా తరలివచ్చిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు..
కలెక్టరేట్‌లోకి వైఎస్సార్‌సీపీ శ్రేణులను అనుమతించని పోలీసులు..
కేవలం పది మందికి మాత్రమే కలెక్టర్‌ని కలిసేందుకు అనుమతి..
గేటు బయట పోలీసులకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం..
జై జగన్ నినాదాలతో హోరెత్తిన జిల్లా కలెక్టరెట్

పిల్లలు కాలేజీలు మానేసి.. పంట పొలాలకు వెళ్తున్నారు:  పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి 
ఎన్నో ఆశలు పెట్టుకొని దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం తీసుకు వచ్చారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో 90 శాతం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పంపిణీ చేశారని.. ఇప్పుడు పిల్లలు కాలేజీలు మానేసి పంట పొలాలకు వెళ్తున్నారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వైయ‌స్ఆర్‌సీపీ త‌ల‌పెట్టిన యువ‌త పోరు కార్య‌క్ర‌మం విజ‌య‌వంత‌మైంది. ఈ సంద‌ర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు పాలన చేస్తోందని, దీనికి పర్యవసానం చెల్లించక తప్పదని పెద్దిరెడ్డి హెచ్చరించారు.

  

Back to Top