సుప్రీంకోర్ట్ ఉత్తర్వులు చంద్రబాబుకు చెంపపెట్టు

పత్రికాస్వేచ్ఛకు వేసిన సంకెళ్ళను న్యాయవ్యవస్థ బద్దలు కొట్టింది

కొమ్మినేని అరెస్ట్ అక్రమం అని దేశం మొత్తం అర్థం చేసుకుంది

వైయస్ఆర్‌టియుసీ అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి 

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌టియుసి అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి

సీఎం చంద్రబాబు కార్మిక వ్యతిరేకి 

పదిగంటల పనిదినాన్ని తీసుకువస్తున్నారు

కార్మికచట్టాలను సవరిస్తూ పనిభారాన్ని పెంచే కుట్ర

వైయస్ఆర్‌టియుసీ అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి ఆగ్రహం

తాడేపల్లి: సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అక్రమం అంటూ సాక్షాత్తు సుప్రీంకోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెంపపెట్టని వైయస్ఆర్‌టీయుసీ అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సంకెళ్ళను న్యాయ వ్యవస్థ బద్దలు కొట్టిందన్నారు. కొమ్మినేని అరెస్ట్ అక్రమం అని సుప్రీంకోర్ట్ ఉత్తర్వులతో దేశం మొత్తం అర్థమయ్యిందని తెలిపారు. ఇంకా ఆయనేమన్నారంటే... 

సుప్రీంకోర్ట్ ఈ రోజు చారిత్రాత్మక ఆర్డర్‌ ఇచ్చింది. సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుపై అక్రమంగా కేసులు బనాయించి, అరెస్ట్ చేయడం తప్పు అని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలను ప్రతిఫలించే మీడియా స్వేచ్ఛను కాపాడే విధంగా తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో చంద్రబాబు ఏడాది పాలనలో అరాచకాలు, అవినీతి, హింసాత్మక విధానాలను ఎత్తి చూపుతున్న ప్రతికాస్వేచ్ఛకు నిరంకుశంగా వేసిన సంకెళ్ళను తెంచినట్లయ్యింది. సాక్షి మీడియా కార్యాలయలపై తన కార్యకర్తలను, నాయకులను ఉసిగొల్పి దాడులు చేయించిన చంద్రబాబు అరాచకానికి తాజాగా సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పు ఒక హెచ్చరిక. న్యాయస్థానం కూడా టీవీ చానెల్స్‌లో విశ్లేషకుడికి వాదనలను ఆపాదించడం తగదు అంటూ చెప్పింది. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కుట్రపూరిత విధానాలను న్యాయస్థానం ఉత్తర్వులు ఎత్తి చూపినట్లయ్యింది.

ఫ్యాక్టరీస్ యాక్ట్‌లో సవరణలకు రంగం సిద్దం

రాష్ట్రంలో చంద్రబాబు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారు. కార్మికశాఖలో ఫ్యాక్టరీస్ యాక్ట్ లోని పలు సెక్షన్‌లను ఎమెండ్‌మెంట్‌ చేసేందుకు సిద్దమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడి సాధించిన ఎనిమిది గంటల పనిదినాన్ని మార్చేందుకు చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారు. ఏకంగా పది గంటల పనిదినంగా పెంచుతూ ఇప్పటికే ఒక సర్క్యులర్ కూడా జారీ చేశారు. గతంలో 50 నుంచి 75 గంటల పాటు ఓవర్ టైం చేసుకునే విధానం ఉంది. దీనిని 144 గంటలు పెంచుతున్నామని చంద్రబాబు చెబుతున్నారు. దీనివల్ల కార్మికులపై పనిభారం పెరుగుతోంది. గతంలో 5 గంటలు పనిచేస్తే 1 గంట విరామం తీసుకుని పనిచేసేవారు. ఇప్పుడు ఏకధాటిగా ఆరు గంటల పాటు పనిచేసి, ఒక గంట విరామం తీసుకుని, తిరిగి పనిలోకి వెళ్ళాలని నిర్ధేశిస్తున్నారు. ఎమర్జెన్సీ సమయంలో పదిన్నర గంటల పనిదినంను అమలు చేశారు. నేడు చంద్రబాబు పాలనలో పన్నెండు గంటలు పనిచేయించాలనే లక్ష్యంతో ఉన్నారు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లో సవరణలు తీసుకురావడం ద్వారా బాధ్యులైన అధికారులు కార్మికుల సదుపాయాలపై తనిఖీలు చేసే అధికారాలను కూడా తొలగిస్తున్నారు. వైయస్ జగన్ పాలనలో కార్మికపక్షపాత విధానాలను అమలు చేశారు. అవుట్ సోర్సింగ్ కార్మికుల కోసం ఒక కార్పోరేషన్‌ను ఏర్పాటు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వపరం చేయడం ద్వారా వారికి న్యాయం చేశారు. అలాగే నేత కార్మికులు, గీత కార్మికులకు అండగా నిలిచారు. చంద్రబాబు పాలనలో ఒక్క కార్మికుడికి కూడా న్యాయం చేయకపోగా, ఉన్న ఉద్యోగాలను తొలగించారు. చివరికి పనిగంటలు పెంచడం, కార్మికుల సదుపాయాలను తనిఖీ చేసే అధికారాలను తొలగించడం ద్వారా కార్మికసంక్షేమాన్ని కాలరాస్తున్నారు.

Back to Top