పంచాయతీరాజ్‌ విభాగం బలోపేతమే ల‌క్ష్యం

వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్  సజ్జల రామకృష్ణా రెడ్డి 

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం 

తాడేప‌ల్లి:  పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు వైయ‌స్ఆర్‌సీపీ పంచాయతీరాజ్‌ విభాగం బలోపేతమే ల‌క్ష్యంగా ప్ర‌తి ఒక్క‌రూ ప‌ని చేయాల‌ని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్  సజ్జల రామకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు. సోమ‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు వెన్నపూస రవీంద్రా రెడ్డి అధ్య‌క్షత‌న నిర్వ‌హించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్  సజ్జల రామకృష్ణా రెడ్డి పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ విభాగ అధ్యక్షులు,  ఇతర ముఖ్య నాయకులకు పార్టీ పంచాయతీరాజ్ విభాగం చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.

సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే...

వైయ‌స్ఆర్‌సీపీలో క్రియాశీలక విభాగంలో ఉన్న మీ అందరి పాత్ర చాలా కీలకమైంది, గతంలో మనకు అసెంబ్లీ ఎన్నికలకు మించి స్దానిక సంస్ధల ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారు, అందరూ సమిష్టిగా పనిచేయడం వల్ల అరుదైన విజయం సాధించాం, పంచాయతీరాజ్‌ విభాగంను బలోపేతం చేయాలని వైయ‌స్ జగన్‌ గారు చెప్పారు, మీ విభాగం బలోపేతం అయినప్పుడే మనకు స్ధానిక సంస్ధల్లో బలంగా ఉండగలుగుతాం, ప్రజలకు, పార్టీకి ఉపయోగపడేలా మీ నాయకత్వం పటిష్టం కావాలి. ఇందులో భాగంగానే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాం. పంచాయతీరాజ్‌ చట్టాన్ని బలోపేతం చేసేందుకు మీరంతా చొరవ తీసుకోవాలి. రాష్ట్ర అభివృద్ది జరగాలంటే గ్రాస్‌ రూట్‌ లెవల్‌లో బలంగా ఉండాలి.

కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు, కక్షసాధింపు చర్యలు, వేధింపులు, రెడ్‌బుక్‌ రాజ్యాంగం ఇలా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైయ‌స్ఆర్‌సీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుంది, ప్రజల్లో, పార్టీ క్యాడర్‌ లో ఇదే చర్చ జరుగుతోంది. చంద్రబాబు సంక్షేమ పధకాలు అమలుచేయడం లేదు, లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా నాశనం అయింది, సామాన్యులు కూడా బలవుతున్నారు, గవర్నెన్స్‌ పూర్తిగా బ్రష్టుపట్టింది, మళ్ళీ గెలవలేమన్న భయంతో కూటమి నేతలు ఎవరి స్ధాయిలో వారు అడ్డంగా దోచుకుంటున్నారు, ఈ ఏడాదిలో 1.67 లక్షల కోట్ల అప్పులు చేసింది కూటమి ప్రభుత్వం, అమరావతిలో 40 వేల ఎకరాలు చాలవన్నట్లు మరో 40 వేల ఎకరాల భూములు లాక్కునే ప్రయత్నం జరుగుతోంది. మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ పేరుతో దోపిడీ నేరుగా పదిశాతం కమిషన్‌ తీసుకుంటున్నారు, వేలకోట్లు దోచుకోవడం లక్ష్యం, ప్రజల ఆకాంక్షలు, కోరికలతో సంబంధం లేకుండా పాలన సాగుతోంది, కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల అమలుపై ప్రజలే నిలదీసేలా మన కార్యాచరణ ఉండాలి, అందుకు ప్రజలను అప్రమత్తం చేద్దాం. 

ప్రజలను చైతన్యం చేయడానికి అవసరమైన కార్యక్రమాలు మనం నిరంతరం చేయాలి, క్షేత్రస్ధాయి వరకు మనం బలోపేతం కావాలి, అందుకే వివిధ విభాగాలతో సమావేశాలు జరుపుతున్నాం, కమిటీలు అన్నీ పూర్తి చేయాలి, మన కమిటీలు అన్నీ పూర్తయితే వైయ‌స్ఆర్‌సీపీ క్రియాశీలక సైన్యంగా 18 లక్షల మంది సిద్దమవుతారు. టెక్నాలజీని ఉపయోగించుకుని మన వాయిస్‌ బలంగా ప్రజల్లోకి తీసుకెళదాం. మన శక్తిసామర్ధ్యాలు జగన్‌ గారిని మరోసారి సీఎంగా చేసుకునేందుకు, పార్టీని బలోపేతం చేసుకునేందుకు వినియోగిద్దామని శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. 

వెన్నపూస రవీంద్రారెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు

మన పంచాయతీరాజ్‌ విభాగం అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీద్దాం, ఉపాధి హామీ నిధుల దోపిడీని అడ్డుకుందాం. కూటమి నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నారు, స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ గెలుపును అడ్డుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు, వాటిని ధీటుగా ఎదుర్కొందాం. స్ధానిక సంస్ధల్లో మన ఉనికిని చాటి చెబుదాం. అనేక అంశాలపై మన విభాగంలో క్రియాశీలకంగా ఉన్నవారంతా ఎప్పటికప్పుడు స్పందించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం.

Back to Top