తాడేపల్లి: ఈనెల 12న చేపట్టిన 'యువత పోరు' ద్వారా రాష్ట్రంలో యువతను, నిరుద్యోగులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. యువత పోరు నిరసన కార్యక్రమంపై తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కోఆర్డినేటర్లు, విద్యార్ధి, యువజన విభాగం నేతలు, 13 యూనివర్శిటీల విద్యార్ధి నాయకులు, మేధావులు, విద్యారంగ ప్రముఖులతో టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్ధులు, యువతను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైయస్ జగన్ గారు యువత పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఫీజు రీఇంబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వం దిగివచ్చేవరకూ పోరాడదాం. అన్ని జిల్లా కేంద్రాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆయా వర్గాల ప్రజలు సంయుక్తంగా ర్యాలీగా జిల్లా కలెక్టర్‌కు మెమోరాండంను సమర్పించాలి. ఇందుకు సంబంధించి యువత, విద్యార్ధులను భాగస్వామ్యం చేయాలి, రాష్ట్రంలోని 13 యూనివర్శిటీల నుంచి వీలైనంతమంది విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రణాళికలు సిద్దం చేయాలి, రేపు (11.03.2025) యూనివర్శిటీల లోపల లేదా బయట యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి వారందరికీ కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్ధను ఎలా నిర్వీర్యం చేసిందో వివరించాలి, వైయస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో విద్యా వ్యవస్ధ ఎలా ఉంది, ఆ తర్వాత విద్యార్ధి, యువత ఎలా నష్టపోయిందనే అంశాలు వారికి వివరించాలి.అనంతరం 12న జరిగే యువత పోరు నిరసన కార్యక్రమంలో అన్ని యూనివర్శిటీలు, కాలేజీల నుంచి విద్యార్ధులు, యువత పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి వారి డిమాండ్‌లు వినిపించాలి. ఈ నిరసన కార్యక్రమం విజయవంతమైనప్పుడే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి వారి సమస్యలు పరిష్కారమవుతాయి, కావున వైయస్ఆర్‌సీపీ విద్యార్ధి, యువజన విభాగాలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమన్నారంటే... యువత పోరు కార్యక్రమం కూటమి ప్రభుత్వం చెంప చెల్లుమనిపించేలా ఉండాలి, విద్యార్ధి, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇందుకు అవసరమైతే రాష్ట్రస్ధాయి నాయకుల సహకారం కూడా అందుబాటులో ఉంటుందని వైయస్ఆర్‌సీపీ విద్యార్ధి, యువజన విభాగాల నాయకులకు సూచించారు.