భగభగమండే సూర్యుడు సీఎం వైయస్‌ జగన్‌

420 ముఠాకు రాజకీయ సమాధి తప్పదు

2024లో దుష్టచతుష్టయం రాజకీయ జీవితాలను పాతాళంలో పాతిపెడతాం

ప్లినరీ సమావేశంలో వైయస్‌ఆర్‌ సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే కొడాలి నాని

గుంటూరు: 2024 ఎన్నికల్లో 420 బ్యాచ్‌ రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు, చంద్రబాబు ముఠాను రాజకీయ సమాధి చేసి.. వారి రాజకీయ జీవితాలను పాతాళంలో పాతిపెట్టి.. నలుగురిని శ్రీనారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రంలో జాయిన్‌ చేసి.. శాశ్వతంగా అక్కడే ట్రీట్‌మెంట్‌ ఇచ్చే బాధ్యత తీసుకుంటామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన శని, నిష్టదరిద్రం దుష్టచతుష్టయాన్ని రాజకీయంగా సమాధి చేయడానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పూనుకుందన్నారు. ప్లినరీ సమావేశంలో వైయస్‌ఆర్‌ సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు.

``నలుగురు గురించి చెప్పాలి. ఆ నలుగురిని 420 గాళ్లు అంటారు. ఒకరు దీనికి రాజ గురువు రామోజీరావు. ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఎవరు ప్రధానిగా ఉండాలని నా పేపర్‌ చదివి ప్రజలు నిర్ణయిస్తారనే పిచ్చి భ్రమలో బతుకుతున్న పిచ్చి రామోజీరావు. రెండో వ్యక్తి ఏబీఎన్‌ రాధాకృష్ణ సైకిల్‌ మీద పేపర్‌ బాయ్‌గా హైదరాబాద్‌ వచ్చాడు. సైకిల్‌ బాయ్‌గా వచ్చిన దొంగ ఆంధ్రజ్యోతి పేపర్‌కు యజమాని అయ్యాడు. మూడోవ్యక్తి బీఆర్‌ నాయుడు. బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగం చేసుకునేవాడు. ప్రపంచంలో ఎవడూ కనిపెట్టలేని మందు కనిపెట్టాడంట.. బట్టతలకు నూనెరాస్తే బొచ్చు వస్తుందని నూనె అమ్మి రూ.600 కోట్లు సంపాదించాడు. బొచ్చు మీద సంపాదించిన బీఆర్‌  నాయుడు. వీరందరికీ కావాల్సిన వ్యక్తి, వారి జేబులో ఉన్న వ్యక్తి, మడత మంచం చంద్రబాబు. 

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రాన్ని దోచుకోవచ్చు. రాష్ట్రంలోని సంపదను లూటీ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా 12 వందల ఎకరాల్లో ఫిల్మ్‌ సిటీ కట్టొచ్చు.. ఈ రాష్ట్రాన్ని దొంగలించొచ్చు. వేలకోట్లు సంపాదించొచ్చు అని దొంగలముఠాగా ఏర్పడి.. సీఎం వైయస్‌ జగన్‌ మీద, ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. 

ఒక మంచి కార్యక్రమం చేసినా.. దానికి కోడిగుడ్డు మీద ఈకలు పీకుతారు. ఈ 420 గాళ్లకు సీఎం వైయస్‌ జగన్‌ భయపడుతారా..? సీఎం వైయస్‌ జగన్‌ వరకు ఎందుకు.. 420 గాళ్లకు నేను కూడా భయపడను. నా గడ్డంలోని వెంట్రుకను కూడా పీకలేరు. 

ఈ రాష్ట్రంలో సీఎం వైయస్‌ జగన్‌ను రాజకీయాల నుంచి సమూలంగా తీసేయాలనే కుట్ర చేస్తున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ లేకపోతే దుష్టచతుష్టయం ఆడిందే ఆట.. చంద్రబాబును పెట్టుకొని అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకోవచ్చు. అధికారం నుంచి వైయస్‌ జగన్‌ను దించే శక్తి వాళ్లకు లేదు. ఎందుకంటే.. ఎన్నికల మేనిఫెస్టోలోని 95 శాతం వాగ్దానాలను నెరవేర్చిన వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌. విద్యారంగంలో అమ్మ ఒడి పథకంతో రూ.20 వేల కోట్లు తల్లుల అకౌంట్లలో వేశారు. నాడు–నేడు మూడు విడతలుగా రూ.20 వేల కోట్లతో 45 వేల ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరిస్తున్నారు. కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా తయారు చేస్తున్నారు. పిల్లలు వేసుకునే దుస్తులు నుంచి.. స్కూల్‌ బుక్స్, ఇంగ్లిష్‌ విద్య, పౌష్టికాహారం అన్నీ తండ్రి స్థానంలో నిలబడి పేద పిల్లల కోసం రూ.65 వేల కోట్లు ఖర్చు చేశారు. 

చంద్రబాబు ఐదు సంవత్సరాల్లో రూ.4 వేల కోట్లు కూడా విద్యారంగానికి ఖర్చుపెట్టలేదు. గోరుముద్ద, విద్యాకానుక, ల్యాప్‌టాప్‌లు, ఇంగ్లిష్‌ మీడియం సీఎం వైయస్‌ జగన్‌ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు. ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్ర వాతావరణాన్ని చూసి.. పిల్లలు ఉన్నత చదువులు చదువుకుంటే మంచి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా అండగా ఉంటారని, తండ్రిగా నమ్మాడు కాబట్టి రూ.60 వేల కోట్లు ఓట్లులేని పిల్లల కోసం ఖర్చుచేస్తున్నారు. 

ఇంగ్లిష్‌ మీడియం పెడితే తెలుగు ఎందుకు చెడిపోతుందని సీఎం వైయస్‌ జగన్‌ అడిగితే.. ఇంత వరకు ఎవరూ సమాధానం చెప్పలేదు. రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌నాయుడు, పవన్‌ కల్యాణ్, చంద్రబాబు, దేశ ఉప ప్రధాని వెంకయ్యనాయుడు గానీ, వారి పిల్లలను ఏ స్కూల్‌లో చదివించారు.. వారి మనవళ్లు, మనవరాళ్లను ఏ స్కూల్‌లో చదివిస్తున్నారు. ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదు. మొత్తం ఇంగ్లిష్‌ మీడియంలోనే చదివించారు. ఈ రాష్ట్రంలో తెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత రెక్కాడితే గానీ, డొక్కాడని నిరుపేద పిల్లలకు మాత్రమే ఉందా..? దేశాలు తిరిగి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం, ఉన్నత విద్యను చదివించుకునే డబ్బున్న మాబోటి పిల్లల దగ్గర ఉందా..? 

ఇంగ్లిష్‌ మీడియం, రాష్ట్రంలోని 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఎన్నో విషయాల్లో ఇబ్బందులు పెట్టారు. పెన్షన్లు చంద్రబాబు రూ.2 వేలు చేశాడంట. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి దసరా పండుగ వచ్చేవరకు ఐదు నెలలు రూ.200 ఇచ్చాడు. వైయస్‌ జగన్‌ ఎన్నికల మేనిఫెస్టోలో రూ.2 వేల పెన్షన్‌ ప్రకటించారు. ఎన్నికలు ఐదు నెలలు ఉండగా రూ.2 వేలు చంద్రబాబు ఇచ్చాడు. మధ్యలో రూ.1000 మాత్రమే ఇచ్చాడు. పెన్షన్‌ లబ్ధిదారుడికి సగటున 60 నెలలకు రూ.60వేలు ఇచ్చాడు. 

వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత రూ.2250 కొంతకాలం ఇచ్చారు.. తరువాత రూ.2500 ఇస్తున్నారు. వచ్చే జనవరి నుంచి రూ.2750, ఆ తరువాత సంవత్సరం రూ.3000 ఇస్తే.. సగటున రూ.2500 ఇస్తే.. పెన్షన్లకు సీఎం వైయస్‌ జగన్‌ ఎంత ఖర్చు చేస్తున్నట్టు. చంద్రబాబు 35 లక్షల మందికి నెలకు రూ.370 కోట్ల చొప్పున.. ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తే.. సీఎం వైయస్‌ జగన్‌ 62 లక్షల మంది నిరుపేదలకు ఒక లక్ష కోట్ల రూపాయలు  పచ్చమీడియాను నడిపే పనికిమాలిన రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు, రామోజీరావు తెలిసినా.. ప్రజలనుంచి సీఎం వైయస్‌ జగన్‌ను దూరం చేయాలని కుట్రలు చేస్తున్నారు. 

ఈరోజు పొద్దున్నే 7 గంటలకు సూటూబూటు వేసుకొని యాంకర్లు కూర్చుకుంటారు. పనికిమాలిన నలుగురు వెధవలను తీసుకువచ్చి.. మేధావులని కూర్చోబెట్టి డిబేట్లు పెడతారు. నిన్న, ఈ రోజు వైయస్‌ విజయమ్మ మీదనే డిబేట్లు పెట్టారు. ఏదో ఒకటి కోడిగుడ్డు మీద ఈకలు పీకాలి. సీఎం వైయస్‌ జగన్‌ అలా చేశారు.. ఇలా చేశారు.. చంద్రబాబు వస్తే రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తాడని చెబుతున్నారు. సిగ్గు,శరం లేని వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు నాయుడు మతిస్థిమితం కోల్పోయి.. పిచ్చిగా తిరుగుతున్నాడు. 

సీఎం వైయస్‌ జగన్‌ భగభగమండే సూర్యుడు. ఆ సూర్యుడికి కాంతిని ఇవ్వడమే తెలుసు. వేడిని ఇవ్వడమే తెలుసు. అయినా సూర్య గ్రహణం, చంద్రగ్రహణాలు వస్తాయి. అది తాత్కాలికం. గ్రహణం పట్టింది సూర్యుడికి కాదు.. సూర్యుడికి, భూమికి మధ్యలో ఉన్న శనిగ్రహణం లాంటి రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌నాయుడు లాంటి లుచ్చాగాళ్లు 5, 10 నిమిషాలు పొరలా వస్తారు కానీ, భగభగమండే జగన్‌మోహన్‌రెడ్డిని ఆపలేరు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలు పిల్లలను చదివించుకోవాలన్నా.. ఇంటి కల నెరవేర్చుకోవాలన్నా, ఆర్థికంగా పైకి రావాలన్నా.. సీఎం వైయస్‌ జగన్‌ను రక్షించుకోవాల్సిన అవసరం, ముఖ్యమంత్రిగా పది కాలాలపాటు ఆ స్థానంలో కూర్చోబెట్టాల్సిన అవసరం వైయస్‌ఆర్‌ సీపీలో పనిచేస్తున్న ప్రతి నాయకుడు, కార్యకర్తల్లోఉండాలి. ఇటువంటి గజదొంగలు, 420 నా కొడుకులు ఎంతమంది వచ్చినా.. 2024 ఎన్నికల్లో పాతాళంలో గొయ్యి తీసి నలుగురు 420 గాళ్లను, వీరితో పాటు దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్, పనికిరాని పుత్రుడు పప్పునాయుడు.. ఆరుగురిని గొయ్యి తీసి పాతిపెట్టేందుకు మీరు, మేము సిద్ధంగా ఉండాలని పేద ప్రజల తరఫున కోరుతున్నా.. 

ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. 2024లో చంద్రబాబు అధికారంలోకి వస్తాడంట. ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగురుతుందంట. రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు ముగ్గురు కలిసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయలేరు. దేశంలో రాజకీయ పార్టీలు నడిపే పార్టీల్లో ఇంత పనికిమాలిన చవట, దద్దమ్మ, వెధవ ఎవరూ లేరు. 

కొడుకు సుంట పప్పుగాడిని ఎమ్మెల్యేగా కూడా చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నాడు. రాష్ట్రంలో 7సార్లు పార్లమెంట్‌ ఎన్నికలు జరిగితే.. మొన్న ముష్టి 3 పార్లమెంట్లు గెలిచాడు. వైయస్‌ఆర్‌ ఉండగా 2004లో 5, 2009లో 6 పార్లమెంట్‌లో గెలిచాడు. ఆరోజున 47 సీట్లకు పరిమితమయ్యాడు. మొన్న 23 సీట్లకు పరిమితమయ్యాడు. 2024లో ముఖ్యమంత్రి అవుతా.. వడ్డీతో సహా ఇస్తా అని మాట్లాడుతున్నాడు. నా గడ్డంలో బొచ్చు కూడా పీకలేవు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడు. అయినా కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. 

2024 ఎన్నికలు అవుతాయి. వైయస్‌ జగన్‌ దెబ్బకు రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌నాయుడు, చంద్రబాబు పర్మినెంట్‌గా పిచ్చి ఆస్పత్రిలో చేరబోతున్నారు. ఈ పిచ్చోళ్లకు ఆస్పత్రి కలర్‌ పసుపు ఉండాలి. ఆ ఆస్పత్రి పేరు కూడా శ్రీనారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం అంటేనే లోపడికి వస్తారు. కాబట్టి అమరావతిలో 5 ఎకరాలు కేటాయించి.. శ్రీనారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం నిర్మాణం చేసి.. పసుపు రంగు వేసి.. బాబు, లోకేష్‌ బొమ్మ వేస్తేనే ఈ పిచ్చోళ్లు ఆస్పత్రికి వస్తారు. వారిని శాశ్వత సభ్యులుగా మానసిక వైకల్య కేంద్రంలో ట్రీట్‌మెంట్‌ చేపించాలని విజ్ఞప్తి. 

తల్లిదండ్రులు పిల్లలు బాగుండాలి. చేసే కార్యక్రమాల్లో విజయం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. వైయస్‌ విజయమ్మకు ఇద్దరు పిల్లలు. ఇక్కడ సీఎం వైయస్‌ జగన్‌.. అక్కడ షర్మిలమ్మ రెండు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జగన్‌ బాబుకు, షర్మిలమ్మకు, పచ్చమీడియాకు ఇబ్బంది లేకుండా నా పదవికి రాజీనామా చేసి తల్లిగా కొనసాగుతానని చెబితే.. నిన్న మధ్యాహ్నం నుంచి 420 నా కొడుకులు ఏం మాట్లాడుతున్నారు. వాళ్లకు ఒక అమ్మ ఉందా.. అబ్బ ఉన్నాడా..? విజయమ్మ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలోని వైయస్‌ఆర్‌ సీపీ కుటుంబ సభ్యులకు తండ్రి వైయస్‌ఆర్‌ అయితే.. తల్లి విజయమ్మ. ఈ ప్రపంచంలో తల్లిని మించిన స్థానం ఏదైనా ఉంటుందా..? 

తల్లి విలువ తెలియని 420 నా కొడుకులు నిన్న మధ్యాహ్నం నుంచి డిబేట్లు పెడుతున్నారు. వైయస్‌ రాజారెడ్డి, వైయస్‌ రాజశేఖరరెడ్డి, వైయస్‌ జగన్‌ను వదలట్లేరు. కొత్తగా చంద్రబాబు సీఎం వైయస్‌ జగన్‌ కూతురు గురించి కూడా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు కొడుకు అమెరికాలో చదువుతున్నప్పుడు నువ్వు, నీ కుటుంబ సభ్యులు నడిచి వెళ్లారా.. లేక సముద్రంలో ఈదుకుంటూ వెళ్లారా..? అమెరికాకు విమానంలో వెళ్లకు దేంట్లో వెళ్తారు..? 

చంద్రబాబును ఏమీ అన్నా.. అనకపోయినా వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. చంద్రబాబు ఉచ్ఛం, నీచం లేదు. భార్యను, తల్లిని, తండ్రిని అన్నా.. ఎవరిని అన్నా.. పట్టించుకోని దిక్కుమాలిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు భార్యను ఎవరూ ఏమీ అనలేదు. 2024లో రాజకీయ సమాధి చేసి.. రాజకీయ జీవితాలను పాతాళంలో పాతిపెట్టి.. నలుగురిని శ్రీనారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రంలో జాయిన్‌ చేసి.. శాశ్వతంగా అక్కడే ట్రీట్‌మెంట్‌ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఈ రాష్ట్రానికి పట్టిన శని, నిష్టదరిద్రం నలుగురిని రాజకీయంగా సమాధి చేయడానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తిప్పికొడుతుంది.`` 

 

 

తాజా వీడియోలు

Back to Top