ఈసీ, రీ పోలింగ్, ప్రజలపై టీడీపీకి విశ్వాసం లేదు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

ప్రజామోదం లేకుండా ఎన్నిక కావాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు 

అమరావతి: ఈసీ, రీ పోలింగ్, ప్రజలపై టీడీపీకి విశ్వాసం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీఅధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టిన చంద్రబాబు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆరు వారాల్లో 8 మంది అనంతపురం రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రగిరిలో దళితులను ఓట్లు వేయకుండా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీడియో ఫుటేజ్‌ పరిశీలించి రీ పోలింగ్‌ జరపాలని ఈసీ నిర్ణయించిందన్నారు. ప్రజామోదం లేకుండా ఎన్నిక కావాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారన్నారు. 2014 ఎన్నికల్లో కూడా దళితులను భయబ్రాంతులకు గురి చేశారని తెలిపారు. రీ పోలింగ్‌ అంటే చంద్రబాబు ఎందుకు కంగారుపడుతున్నారని ప్రశ్నించారు. చంద్రగిరిలో ఐదు చోట్ల రీ పోలింగ్‌ జరిగితే టీడీపీ గల్లంతవుతుందా అని నిలదీశారు. ఓటమి భయంతో చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు.  

తాజా ఫోటోలు

Back to Top