తాడేపల్లి: శవం దొరికితే చాలు.. ప్రతిపక్ష నేతలు కాకుల్లా, గద్దల్లా, రాబందుల్లా వాలిపోతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా.. గద్దల్లా టీడీపీ నేతలు వాలిపోవడం, ప్రతిదానినీ రాజకీయం చేయడం చూస్తుంటే.. చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు వెళ్ళినట్టు అనిపిస్తుందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారి 35 నెలల సంక్షేమ పరిపాలన చూసి, ఒక్క రూపాయి అవినీతి లేకుండా, ప్రతి గడపకూ, ప్రతి పేదవాడికీ, ప్రతి బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి, దళిత, మహిళా పక్షపాతిగా ఆయన చేస్తున్న గొప్ప పనులు చూసి, ఇలాగైతే, తమకు పుట్టగతులు ఉండవు అని టీడీపీ నేతలు భయంతో వణికిపోతున్నారు. అందుకే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పద్మజ మీడియాతో మాట్లాడారు. - వర్షం పడినప్పుడు వచ్చే పుట్టగొడుగుల్లా.. ఏదో ఘటన జరిగినప్పుడల్లా మీరు శవాల మీదకు వచ్చి వాలతారు. గుంటూరు జిల్లా తుమ్మపూడి గ్రామంలో మహిళ హత్య జరిగితే.. గంటల్లోనే పోలీసులు స్పందించి, నేరస్తులను గుర్తించి, అరెస్టులు కూడా చేశారు. ఆ ఘటనలో పోస్టుమార్టం జరిగిన తర్వాత భౌతిక కాయాన్ని కూడా వారి స్వ గ్రామానికి తీసుకెళ్ళనీయకుండా, హిందూ ధర్మం ప్రకారం సాయంత్రం లోపల అంత్యక్రియలు జరపాలని వారి బంధువులు ఎంత చెప్పినా వినకుండా, తమ నాయకుడు లోకేష్ వస్తున్నాడని తెలుగుదేశం రౌడీ గ్యాంగ్ నిన్నంతా చేసిన నీచమైన రాజకీయాన్ని రాష్ట్ర ప్రజలంతా చూశారు, వారి పిల్ల చేష్టలను, శవ రాజకీయాలను చూసి ఛీ కొడుతున్నారు. - ఏదైనా శవం దొరికితే.. కాకుల్లా, గద్దల్లా, రాబందుల్లా వాలిపోయే టీడీపీ సంస్కృతి నీచంగానూ, దరిద్రంగానూ అనిపిస్తుంది. - మొన్నటికి మొన్న విజయవాడలో ఒక మానసిక వికలాంగురాలైన యువతి మీద అత్యాచారం జరిగితే.. చంద్రబాబు తన తొట్టి గ్యాంగ్ ను తీసుకెళ్ళి.. ఆసుపత్రి మీదకు ఒక దాడికి వెళ్ళినట్టు వెళ్ళి, అక్కడ ఉన్న మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ మీదనే దౌర్జన్యం, దాడి చేసినంత పని చేశారు. మీడియా సాక్షిగా రాష్ట్ర మహిళలంతా చంద్రబాబు, ఆయన గ్యాంగ్ చేసిన దౌర్జన్యాన్ని చూశారు. టీడీపీకి కెమెరాల పిచ్చి.. తెలుగుదేశం నేతలకు ఎందుకింత కెమెరాలు, పబ్లిసిటీ పిచ్చి అని అడుగుతున్నాం. మీడియా కెమెరాలు కనిపిస్తే వీరికి ఎందుకు పూనకం వస్తుంది. ఇదే కెమెరాల పిచ్చితో గోదావరి పుష్కరాల్లో 29 మంది చావులకు చంద్రబాబు కారణమయ్యాడు. పరామర్శ పేరుతో తుమ్మపూడిలో లోకేష్ చేసిన హంగామా, దాడి చూస్తే.. వీరి శవ రాజకీయం, చిల్లర రాజకీయం ఏమిటో రాష్ట్ర ప్రజలంతా చూశారు. వందల సంఖ్యలో జనాన్ని పోగేసుకుని, వేరే నియోజకవర్గాల నుంచి టీడీపీ కార్యకర్తలను పోగేసుకుని, ఒక గ్రామం మీద దాడికి వచ్చినట్టు లోకేష్ వెళ్ళాడంటే ఏమనాలి, ప్రజలు ఛీ కొడుతున్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా..?. మందీ మార్భలంతో, ఏదో యుద్ధానికి వెళ్ళినట్టు లోకేష్ వెళితే... అక్కడ రాళ్ళ దాడి జరిగితే పోలీసులు కూడా గాయపడ్డారు. ఇది టీడీపీ నేతలు చేసిన రాళ్ళ దాడి, దౌర్జన్యం అని రాష్ట్ర ప్రజలు గమనించారు. - మంగళగిరి అని కూడా పలకలేని లోకేష్.. టీడీపీ హయాంలో, ఆయన మూడు శాఖలకు మంత్రిగా ఉన్నప్పుడు.. ఏ రోజు అయినా, ఏ ఒక్క సమస్య మీద అయినా మాట్లాడాడా..?. ఆరోజే గనుక ప్రజల సమస్యల గురించి మాట్లాడినట్టైతే, మంగళగిరిలో లోకేష్ ఎందుకు ఓడిపోతాడు...?. వళ్ళు అయితే తగ్గింది కానీ, బుద్ధి మాంద్యం ఇంకా లోకేష్ కు తగ్గలేదు. తండ్రీకొడుకులిద్దరికీ ప్రజల పట్ల బాధ్యత లేదు. శూర్పణఖ, తాటకి సిస్టర్స్.. తెలుగు మహిళలు అని చెప్పుకుంటున్న ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, పంచుమర్తి అనురాధ మరికొంతమంది వీరే మహిళా ఉద్ధారణకు కొంగు బిగించినట్టు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు, వీరి మాటలు, చేష్టలు చూస్తే.. వీరు తెలుగు మహిళలు కాదు.. తెగులు మహిళలు అనాలి. శూర్పణఖలు, తాటకిలు టీడీపీలో కొత్తగా బయలుదేరారు. వీరిని తెలుగు మహిళలు అనటం కంటే.. తాటకి సిస్టర్స్, శూర్పణఖ సిస్టర్స్ అనాలి. వారు మాట్లాడుతున్న భాష ఏంటో, ఆ చీరల గొడవ ఏంటో.. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో, ఆ పార్టీ జెండాలను వెనుక పెట్టుకుని మాట్లాడుతున్న వారి ప్రెస్ మీట్లు చూస్తే అసహ్యం కలుగుతుంది. ఇంకా, మేం ఇలానే మాట్లాడతాం అని అంటారా.. మీ మాదిరిగా, మేము కూడా మాట్లాడాలనుకుంటే, మాకు కూడా ఆ భాష వచ్చు. మా నాయకుడు మాకు సంస్కారం నేర్పాడు కాబట్టి, మేము ఆ భాష మాట్లాడటం లేదు. పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెడితే అవి సంస్కారవంతంగా ఉండాలి అని మా నాయకుడు మాకు చెబుతారు. - మేం కూడా, ముసలి నక్క అనో, గజ్జి కుక్క అనో మీ నాయకుడిని మాట్లాడవచ్చు.. కానీ మా సంస్కృతి అది కాదు. ఈరోజు పంచుమర్తి అనురాధ, అనితలు నోరు ఉందికదా అని ఏదిపడితే అది మాట్లాడుతున్నారు. వీరికి అసలు క్యారెక్టర్, నీతివంతమైన బతుకు ఉందా అని అడుగుతున్నాను. పార్టీ ఆఫీసుల్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ చీరల గొడవేంంటి..? మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ గారు చూపిస్తున్న ప్రత్యేక చొరవ వల్లే.. సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ, గత మూడు ఏళ్ళుగా వరుస విజయాలను మహిళలు, ప్రజలు అందిస్తున్నారు. సంసారపక్షంగా ఉండేదానిని కొంప అనరు మహిళలు ఎవరైనా కొంప అని మాట్లాడరు. గృహం అనో, ఇల్లు అనో అంటారు. కట్టుబాట్లు, సభ్యత, సంస్కారం లేనివాళ్ళు, కుటుంబ విలువలు లేని వాళ్ళే ఇలాంటి భాష మాట్లాడతారు. పిశాచులు, దయ్యాలు ఉండే వాటినే కొంప అని అంటారు. ఒక కుటుంబంలో, భార్య, భర్త, పిల్లలు అంతా కలిసి ఉంటే దానిని గృహం అని పిలుస్తారు. "ఇక్కడ లింగమనేని గెస్ట్ హౌస్ లో మొగుడు ఉంటాడు. కోడలు, భార్య హోటల్ లో రూములు తీసుకుని కాపురాలు పెడతారు, వాటిని కొంపలు అంటారు. అటువంటివాటిని కుటుంబాలు అని, గృహాలు అని అనరు." - నీకు తెలియకపోతే నేర్చుకో అనిత.. సంసారులు, సంసారపక్షంగా ఉండేదాన్ని ఎవరూ కొంప అని అనరు. మాట్లాడితే తాడేపల్లి కొంప అని మాట్లాడుతున్న మీరు, ఇకనైనా మీ భాష మార్చుకోండి. బడుగు, బలహీన వర్గాలకు, మైనార్టీలకు, అగ్ర వర్ణాల్లో ఉన్న పేదలకు కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, వారికి ఒక అన్నలా చేయూత, భరోసా కల్పిస్తూ, ప్రతి నిత్యం వారి మేలు కోసం ఆలోచించే జగనన్న ఉండేదాన్ని గృహం అని అంటారు. మీ మాదిరిగా కొంప అని అనరు. - మీరు హోటళ్ళల్లో, లాడ్జిల్లో ప్రజల సొమ్ముతో, కోట్ల రూపాయలు వెచ్చించి భార్యను, కోడలును హైదరాబాద్ లో హయత్ హోటల్ లో పెట్టి, మీరు మాత్రం ఇక్కడ లింగమనేని గెస్ట్ హౌస్ లో కూర్చుంటారు... అదీ మీ కొంపల్లో జరిగే బాగోతం అని మేం కూడా మాట్లాడవచ్చు. మీరు అలానే మాట్లాడండి.. మిమ్మల్ని ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెడతారు. - కుటుంబ విలువలు, క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఇలా మాట్లాడరు. మంత్రులు ఖరీదైన చీరలు కట్టుకుంటున్నారు, నగలు వేసుకుంటున్నారని మాట్లాడటం ఏమిటి...?. చీర కట్టుకున్నా, చుడిదార్ వేసుకున్నా మన నడవడిక, నడతను బట్టే మనకు గౌరవం వస్తుందని తెలుసుకోవాలి. - మీ మాదిరిగా మేం మాట్లాడాలంటే.. మీ పార్టీ అశుద్ధం పార్టీ.. అశుద్ధం రంగు పార్టీ అని అనవచ్చు. మాకు సంస్కారం అడ్డొస్తుంది. మీరు నోరు అదుపులో పెట్టుకోండి. ఇలానే మాట్లాడిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి 5 సార్లు సీటు ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదు. ఇంకో దళిత నాయకుడు నోరు వేసుకుని ఏదేదో మాట్లాడతాడు. చంద్రబాబు ఇచ్చే పేమెంట్ల కోసం గజ్జి కుక్కల్లా మొరిగితే.. మీరు ఎప్పటికీ శాశ్వతంగా ప్రజల్లో గెలవలేరు. - మీ పార్టీ హుస్సేన్ సాగర్ లో కలపాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో 3 స్థానాలను కూడా టీడీపీ గెలుచుకోలేదు. మీరు ఇలానే మాట్లాడండి, ఇదే సంస్కృతిని కొనసాగించండి. ప్రజలు బుద్ధి చెప్పటానికి సంసిద్ధంగా ఉన్నారని చెప్పదలచుకున్నాం. ఉన్మాదం అంటే అదీ... టీడీపీ హయాంలో అనిత ఎమ్మెల్యేగా ఉండి, ఏ రోజు అయినా వనజాక్షి గురించి గానీ, రిషితేశ్వరి ఆత్మహత్య గురించి గానీ మాట్లాడావా..?. మహిళల మీద అఘాయిత్యాలు జరిగితే.. ఆ ముసలి నక్క.. ప్రభుత్వ ఆఫీసులో, క్యాంపు ఆఫీసులో పంచాయితీలు చేసినప్పుడు అనిత గుడ్డి గుఱ్ఱాలకు పళ్ళు తోముతుందా..? ఉన్మాదం అంటే.. మీ హయాంలో, మీ పార్టీ నాయకులు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలను ఉన్మాదం అంటారు. . - అంతెందుకు మొన్న చంద్రబాబు పుట్టిన రోజునాడు.. మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, అచ్చోసిన ఆంబోతు అచ్చెన్నాయుడు సభా వేదిక మీదే, ఒక మహిళను తడుముతూ.. లైంగికంగా ఏ విధంగా వేధించాడో రాష్ట్ర ప్రజలంతా చూశారు. అప్పుడు ఏ గుడ్డి గుఱ్ఱానికి పళ్ళు తోముతున్నావు అనితా...?. మహిళలను ఉద్ధరిస్తానని, మహిళా రక్షకురాలిగా చీర కొంగు బిగించానంటున్నావు కదా.. ? -ఇటువంటి మాటలు, ఇటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి టీడీపీ నేతలు, మహిళల కోసం కొంగు బిగిస్తామని చెబుతుంటే.. ప్రజలు ఛీ కొడుతున్నారు. - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మహిళా కార్యకర్తగా, జగనన్న ప్రభుత్వంలో మహిళలకు ఆయన రక్షా బంధన్ గా ఉన్నాడని మేం గర్వంగా చెబుతున్నాం. ఏనాడైనా చంద్రబాబు మహిళల భద్రత కోసం, వారి భరోసా కోసం కనీసం సంకల్పం అయినా చేశాడా, ఆ దిశలో చర్యలు ప్రారంభించాడా.. అని ప్రశ్నిస్తున్నాం.