సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన నూత‌న ఎమ్మెల్సీలు

స‌చివాల‌యం: ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి ఘ‌న విజ‌యం సాధించిన నూత‌న ఎమ్మెల్సీలు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.  అసెంబ్లీలోని సీఎం కార్యాల‌యంలో నూతన ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నర్తు రామారావు, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి, కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు. ఈ మేర‌కు నూతన ఎమ్మెల్సీలను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అభినందించారు. శాస‌న‌మండ‌లి స‌భ్యులుగా త‌మ‌కు అవకాశం కల్పించిన సీఎంకు నూతన ఎమ్మెల్సీలు కృతజ్ఞతలు తెలిపారు. నూత‌న ఎమ్మెల్సీల‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు. 

Back to Top