ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా సీఎం వైయస్‌ జగన్‌ పాలన

విశాఖను మరింత అభివృద్ధి చేస్తాం

జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ విజయసాయిరెడ్డి

విశాఖపట్నం: ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ నార్త్‌ నియోజకవర్గంలోని 8 వార్డుల్లో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థుల తరఫున ఎంపీ విజయసాయిరెడ్డి ప్రచారం నిర్వహించారు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. విశాఖ అభివృద్ధి వైయస్‌ఆర్‌ సీపీతోనే సాధ్యమన్నారు. శివనగర్‌లో కమ్యూనిటీ హాల్, ధోబీ ఘాట్‌ నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. మురికివాడల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని చెప్పారు. వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top