‘మిలేంగే’ అంటే బాబు మ‌ళ్లీ క‌ల‌లు కంటున్నాడు

బాబు, ఎల్లో మీడియాకు వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చుర‌క‌లు

న్యూఢిల్లీ: ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌, ఎల్లో మీడియా చేస్తున్న హ‌డావిడిపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి సెటైర్లు వేశారు. త‌న ట్వీట్ల ద్వారా చంద్ర‌బాబుకు, ప‌చ్చ మీడియాకు చుర‌క‌లంటించారు. ``‘మిలేంగే’ అని అన్నారో లేదో చంద్రబాబు మళ్ళీ తనకు పాతరోజులు వచ్చినట్టే కలలు కంటున్నాడు. ఇద్దరు వ్యక్తులు నిమిషం మాట్లాడినా వెళ్లేటప్పుడు మిలేంగే (కలుద్దాం) అనడం సాధారణం. దాని అర్థం అప్పుడప్పుడు ఢిల్లీకి రండి అని కాదు. ‘ఊహలు గుసగుసలాడే’ అన్నట్టు కుల మీడియాతో డప్పు కొట్టిస్తున్నాడు``.

మ‌రో ట్వీట్‌లో ``పచ్చ కుల మీడియా ఆనంద పులకింతలు చూస్తుంటే చకోరపక్షి కథలు గుర్తు రావట్లేదూ? చకోరాలు మేఘాల కోసం చూస్తూ వర్షపు చినుకులు భూమికి చేరక ముందే గాలిలో మాత్రమే తాగుతాయట. అలాగే ఉంది చంద్రబాబు అనే చకోరం ‘మోదీ గారి పలకరింపు’ అనే దీనగాథ!`` అంటూ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top