బోరున విలపించిన బాబు.. ఇప్పుడు చేసున్నదేమిటో? 

ట్విట్టర్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

హైదరాబాద్‌: పోరుగు రాష్ట్రం తెలంగాణ ఏపీ వినాశనాన్ని కోరుకుంటుందని బోరున విలపించిన బాబు ఇప్పుడు చేసున్నదేమిటో? అంటూ వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో ప్రశ్నించారు.  తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీని సోనియా,ఉత్తరాది నేతల పాదాల ముందు పడేశాడని పేర్కొన్నారు. ఎప్పుడు కలవాలో ఎప్పడు విడిపోవాలో ఈయన కంటే వాళ్లకు బాగా తెలుసు అని, లగడపాటి ఎగ్జిట్‌పోల్‌ సర్వేను నమ్మి ఎగ్జిట్‌ అయిన తెలుగు తమ్ముళ్లు..23 తర్వాత తేడా వస్తే ఆయన్ను నిలదీసేట్టున్నారని పేర్కొన్నారు.  పార్టీ ఓడి, బెట్టింగ్‌లలో నష్టపోయిన వారు ఊరుకుంటారా? మాజీ ఎంపీ కాబట్టి పోలీసు ప్రొటెక్షన్‌ అడగొచ్చు తప్పలేదు.చంద్రబాబు,లగడపాటి రేపటి నుంచి మీ ఫోన్లు కూడా ఎత్తరు..లగడపాటి సర్వేలో ఆయన మెదడును డీఎన్‌ఏ డామినేట్‌ చేసిందని ట్విట్ చేశారు.
బాబును  ‘ఫెవికాల్ బాబా’ అంటున్నారు..
ప్రస్తుతం చంద్రబాబును ఢిల్లీలో అందరూ ‘ఫెవికాల్ బాబా’ అని పిలుస్తున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. పిలవని పేరంటంలా అందరి ఇళ్లపై పడి ఫొటోలు దిగుతూ, వాళ్లను, వీళ్లను కలుపుతా అంటూ చంద్రబాబు తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ఇది చూసిన ఢీల్లీ నేతలు చంద్రబాబుకు ఈ మారుపేరు పెట్టారనీ, జోకులు వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Back to Top