నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తాం

వైయస్‌ఆర్‌ సీపీ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా

4 వేల మందికి ఉద్యోగ అవకాశాలు.. అందులో 75 శాతం మహిళలకే ప్రాధాన్యం

విశాఖను స్లమ్‌ లేని ప్రాంతంగా తీర్చిదిద్దుతాం

వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి

విశాఖ: నిరుద్యోగ సమస్య నిర్మూలించాలనే ధ్యేయంతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముందుకెళ్తుందని, 4 వేల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పార్టీ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళాలు నిర్వహించడం జరుగుతుందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చెప్పారు. మెగా జాబ్‌మేళాకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. 24, 25 తేదీల్లో విశాఖపట్నంలో ఆంధ్రయూనివర్సిటీ కన్వెన్షన్‌ హాల్‌లో, 25వ తేదీన పార్వతీపురంలోని గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజీలో, మే 2వ తేదీన శ్రీకాకుళంలోని ఆనందమాయి కన్వెన్షన్‌ హాల్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. 

వైయస్‌ఆర్‌ సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాలో 4 వేల పైచిలుకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నామని, ఇందులో 70 నుంచి 75 శాతం మహిళలకే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. టెన్త్, ఇంటర్, డిప్లమా, డిగ్రీ, బీటెక్, ఫార్మసీ కోర్సుల్లో ఉత్తీర్ణులైన 23 నుంచి 38 సంవత్సరాలు కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 50కి పైగా ప్రముఖ కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటాయన్నారు. కరోనా కారణంగా అక్కడికక్కడే ఇంటర్వ్యూలు నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి.. ముందుగానే వెబ్‌సైట్‌లో పెట్టిన అప్లికేషన్స్‌ అన్నీ ఫిల్‌ చేయించడం జరుగుతుందన్నారు. చి.. ముందుగానే అప్లికేషన్స్‌ వెబ్‌సైట్లో పెట్టడం జరుగుతుంది. 

ఇది ఆరంభం మాత్రమేనని, మిగతా అన్ని జిల్లాల్లో ఇలాంటి జాబ్‌మేళాలు నిర్వహించడం జరుగుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఉద్యోగ, ఉపాధి, సంక్షేమ పథకాల అమలులో కులానికి, మతానికి, ప్రాంతానికి, వర్గానికి తేడా చూపించకుండా అర్హత కలిగిన యువతీ యువకులకు ఎటువంటి వివక్ష లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఇదే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమన్నారు. 

జీవీఎంసీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడం జరుగుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు.  విశాఖను సుందరమైన నగరంగా తీర్చిదిద్దనున్నామన్నారు. విశాఖలో ఉన్న 740 స్లమ్స్‌ను అభివృద్ధి చేస్తామని, ప్రభుత్వ భూముల్లో ఉన్న స్లమ్స్‌లో నివసించేవారందరికీ పట్టాలు ఇస్తామని, ప్రైవేట్‌ భూముల్లోని స్లమ్స్‌లో నివసిస్తున్న వారికి కూడా ప్రభుత్వం ద్వారా పట్టాలు ఇప్పించి ఇళ్లు కట్టించడం జరుగుతుందన్నారు. పార్కులను అభివృద్ధి చేయడం, వాటర్‌ బాడీస్‌లను క్లీన్‌గా మెయిన్‌టైన్‌ చేస్తాం. త్వరలో భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కూడా శంకుస్థాపన జరుగుతుంది, 6 లైన్ల రోడ్డుతో పాటు వివిధ రకాల ప్రాజెక్టులకు అతి త్వరలో సీఎం వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరుగుతాయని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. 
 

Back to Top