సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఎంపీ ఆర్‌.కృష్ణ‌య్య‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆర్‌.కృష్ణ‌య్య తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా బలహీనవర్గాల అభ్యున్నతికి, వారి ఆర్థిక, సామాజిక పురోభివృద్దికి  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయా వర్గాలకు చేరువ చేయాలని బీసీ నేతలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సూచించారు. అదే విధంగా ఎంపీ ఆర్‌.కృష్ణ‌య్య బీసీలకు సంబంధించిన‌ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ళగా.. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సానుకూలంగా స్పందించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన వారిలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్, ప్రధాన కార్యదర్శి శేషపాణి ఉన్నారు.

తాజా వీడియోలు

Back to Top