ఉమ్మడి రాష్ట్రంలో 54 ప్రాజెక్టులు ప్రవేశపెట్టిన ఘనత వైయస్‌ఆర్‌ది

హరీష్‌రావు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో..

వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

విజయవాడ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 54 ప్రాజెక్టులు ప్రవేశపెట్టిన మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అని వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ గుర్తుచేశారు. తెలంగాణ మంత్రి హరీష్‌రావు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని సూచించారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎప్పుడూ తెలంగాణను వెనుకబాటుకు గురిచేయలేదన్నారు. వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలబడటానికి ఆద్యులు మహానేత వైయస్‌ఆర్‌ అని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించేందుకు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ప్రధానమంత్రిని కలిసినప్పుడల్లా మాట్లాడుతూనే.. పార్లమెంట్‌లో పోరాడుతూనే ఉన్నామన్నారు. 
 

Back to Top