హోదా, విభజన హామీలు సాధించి తీరుతాం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగాం సురేష్‌
 

అమరావతి: విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధించేందుకు ఎంపీలంతా కలిసికట్టుగా ఉండాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బాపట్ల ఎంపీ నందిగాం సురేష్‌ అన్నారు. పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం నందిగాం సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. నాయకుడికి క్యారెక్టర్‌ ఉండాలి.. క్యారెక్టర్‌తోనే ముందుకు వెళ్లాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ సూచించారన్నారు. గతంలో ముగ్గురు ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేశాడని, దొంగతనం చేసిన సీట్లనే భగవంతుడు చంద్రబాబు ఇచ్చాడన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు రాబట్టుకునేందుకు ఎంపీలంతా ఒక్కతాటిపై ఉండి సాధించే దిశగా ప్రయత్నం చేయాలని సూచించారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించి తీరుతామన్నారు.

 

Back to Top