నా గెలుపు వైయస్‌ జగన్‌ కష్టార్జితం

వైయస్‌ జగన్‌పై నమ్మకానికి నిదర్శనమే ఈ విజయం

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ  నందిగం సురేష్‌

 

గుంటూరు: ఈ మహా విజయం వైయస్‌ జగన్‌ కష్టార్జితం అని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. తనను గెలిపించి పార్లమెంటుకు తీసుకెళ్తానని గతంలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారని..తను గెలిచానంటే అది ఆయన రెక్కల కష్టమేనని తెలిపారు.ఐదేళ్ల పాటు చంద్రబాబు మోసపూరిత పాలన సాగిందని..మోసానికి,నమ్మకానికి మధ్య జరిగిన యుద్ధంలో ఫ్యాన్‌ గాలికి చంద్రబాబు,ఆయన పార్టీ కొట్టుకుపోయిందన్నారు.20 ఏళ్ల పాటు వైయస్‌ జగన్‌ సీఎం గా ఉంటారని ప్రజలిచ్చిన తీర్పే నిదర్శనమని తెలిపారు.ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనమే ఈ విజయం అని పేర్కొన్నారు.ప్రజలు మేలు చేసేవిధంగా పని చేస్తామని తెలిపారు. ప్రజలందరికి అందుబాటులో ఉంటానన్నారు.

Back to Top