అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారతాడు

బాబు మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు

వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌

రాజమండ్రి: చంద్రబాబు తన సామాజికవర్గం, పెత్తందారి మనస్తత్వం ఉన్నవారిని మాత్రమే పైకి తీసుకువస్తాడు.. పేదలను అసలు పట్టించుకోడని, అధికారంలోకి వచ్చిన తరువాత ఏ విధంగా ప్రజలకు మొండి చెయ్యి చూపిస్తాడో గతంలో చూశామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. ఏరుదాటే వరకు ఓడ మల్లన్న, ఏరుదాటిన తరువాత బోడి మల్లన్న అన్నట్టుగా చంద్రబాబు తీరు ఉంటుందన్నారు. రాజమండ్రిలో ఎంపీ మార్గాని భరత్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని, గతంలో అనేక హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడూ అదే తరహాలోనే మేనిఫెస్టోతో వస్తున్నాడన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మాయమాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. నిరుద్యోగ భృతి అని చెప్పి వెయ్యి రూపాయలు కూడా ఎంతమందికి ఇచ్చాడని ప్రశ్నించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు నిరుద్యోగ భృతి ప్రారంభించి అరకొరగా డబ్బులు అందజేశారన్నారు. ఇంటికి రెండు ఉద్యోగాలు ఇస్తానని చంద్రబాబు మాట్లాడుతున్నాడని, ముందు కొడుకు లోకేష్, దత్త పుత్రుడు పవన్‌కు రెండు ఉద్యోగాలు ఇవ్వగలడో.. లేదో.. తెలుసుకోవాలన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top