విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అందించే పథకాలు మాకు అందాయి అని ప్రతీ గడపలో చెబుతున్నారని విజయవాడ వైయస్ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. విజయవాడ నగరంలోని పటమటలంక 9వ డివిజన్ లో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం, 9వ డివిజన్ పరిధిలో వల్లూరి ఈశ్వర్ ప్రసాద్, గద్దె కళ్యాణ్ రాం గార్ల ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో గడప గడపకు తిరిగి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను వివరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేశినేని నాని, దేవినేని అవినాష్ లకు డివిజన్ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. నియోజకవర్గంలో దీర్ఘ కాలిక సమస్యలకు దేవినేని అవినాష్ పరిష్కారం చూపారన్నారు. స్క్రూ బ్రిడ్జి అండర్ పాస్ నిర్మాణానికి స్థానిక నాయకులు చేసిన కృషి అభినందనీయమన్నారు. సీఎం వైయస్ జగన్ అందించే పథకాలు మాకు అందాయి అని ప్రతీ గడపలో చెబుతున్నారు. నేదురుమల్లి , ఎన్టీఆర్ నీ వెన్ను పోటు పొడిచింది చంద్రబాబు కాదా! అని నాని ప్రశ్నించారు. చంద్రబాబు శిష్యులు కాబట్టే మంచి చేసే వైయస్ జగన్ ప్రభుత్వం పై కుక్కల లాగా వాగుతున్నారని మండిపడ్డారు. మేము మాటల వ్యక్తులం కాదు - చేతల ప్రభుత్వంలో వున్నామని చెప్పారు. టీడీపీ చిల్లర నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పని లేదన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీస్తోందని చెప్పారు. స్క్రూ బ్రిడ్జ్ అండర్ పాస్ పనులు ఎలా పూర్తి చేస్తారో అని ఎల్లో మీడియా లో విమర్శించారు. అండర్ పాస్ పనులను త్వరితగిన పూర్తి చేస్తున్నామని చెప్పారు. నిస్సిగ్గుగా టీడీపీ నేతలు వైయస్ జగన్ ప్రభుత్వం పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రిటైనింగ్ వాల్ టిడిపి నిర్మిస్తే వరదలు ఏందుకు వచ్చాయో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పాలని నిలదీశారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు వ్యక్తిగత దూషణకు దిగుతున్నారని, ప్రజలు అందరూ వైయస్ఆర్‌సీపీకి అండగా ఉన్నారని తెలిపారు.