అసెంబ్లీ: ప్రజా సమస్యలపై చర్చించాల్సిన పవిత్రమైన అసెంబ్లీలో బాలకృష్ణ మీసం తిప్పడం హేయమైన చర్య అని, ఈ నాలుగేళ్లలో అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ఏనాడైనా ప్రస్తావించావా..? అని బాలకృష్ణను వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ప్రశ్నించారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా చంద్రబాబు నిలిచాడని, స్కిల్ స్కామ్ పేరుతో యువతను మోసం చేసి అడ్డంగా దొరికిపోయాడన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ పోతుల సునీత మీడియాతో మాట్లాడారు. రూ.371 కోట్ల స్కామ్‌లో సాక్షాధారాలతో సీఐడీకి చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడన్నారు. రాజమండ్రి జైల్లో కూర్చొని సత్యహరిశ్చంద్రుడి వారసుడినని బుకాయిస్తున్నాడన్నారు. బాలకృష్ణ ఈ నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాడారా..? అని ప్రశ్నించారు. అవినీతిపరుడు చంద్రబాబుకు వత్తాసు పలుకుతూ అసెంబ్లీలో మీసాలు తిప్పడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఈ పౌరుషం నీ తండ్రి ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచి పార్టీని, ముఖ్యమంత్రి సీటును లాక్కున్నప్పుడు ఏమైందని బాలకృష్ణను ఎమ్మెల్సీ పోతుల సునీత ప్రశ్నించారు. ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించినప్పుడు బాలకృష్ణ పౌరుషం ఏమైందని నిలదీశారు. అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు రాజమండ్రి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడకుండా బాలకృష్ణ సిగ్గు లేకుండా ప్రవర్తించాడని మండిపడ్డారు.