వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేకు పాలాభిషేకం చేసి పల్లకిలో ఊరేగింపు.. 

అజ్జాడ - పి.చాకరపల్లి గ్రామ నూతన బీటీ రహదారిని నిర్మించిన ఎమ్మెల్యే అల‌జంగి జోగారావు

ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు గ్రామ‌స్తుల ఘ‌న సన్మానం

పార్వ‌తీపురం:  ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్ఫూర్తిగా  ఇచ్చిన హామీని నిల‌బెట్టుకున్న వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేను ప్రజలు ఊరేగించారు.. అనంతరం పాలాభిషేకం కూడా చేశారు. ఎమ్మెల్యే తమ ఊరికి రోడ్లు వేయించడంతో గ్రామస్తులు అభిమానం చాటుకున్నారు. ప్రజల అభిమానాన్ని చూసిన నేత బావోద్వేగానికి గురవ్వడంతో పాటు కన్నీళ్లు పెట్టుకున్నాడు.. అంతగా ఆ ఎమ్మెల్యే ఏం చేశారంటే..ఇక ఎప్పటికి తమ గ్రామానికి రోడ్డును చూడలేము అనుకున్న వారి కలను నెరవేచ్చాడు. దాంతో జనాలు ఆయనకు ఘనంగా పాలాభిషేకంను నిర్వహించారు..

వివరాల్లోకి వెళితే..పార్వతీపురం మన్యం జిల్లా బలిజి పేట మండలం పి. చాకరాపల్లి గ్రామస్తుల చిరకాల వాంఛ నెరవేరింది. గత య‌బై ఏళ్లుగా ఆ గ్రామానికి రోడ్డు లేదు. చిన్నపాటి అవసరానికి అయినా గ్రామం నుంచి బయటకు రావాలంటే గ్రామస్తులు అష్టకష్టాలు పడేవారు.. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారానికి వెళ్ళడం గ్రామానికి రోడ్డు వేయిస్తామని హామీ ఇవ్వడం ఇక్కడ పరిపాటిగా వస్తుంది. ఈ క్రమంలోనే జరిగిన 2019 ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఈ గ్రామానికి ప్రచారానికి వెళ్ళారు. అందులో భాగంగా పార్వతీపురం వైయ‌స్ఆర్‌సీపీ తరఫున బరిలోకి దిగిన ఎమ్మెల్యే అలజంగి జోగారావు గ్రామానికి రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు..

అంతే ఆ మాటతో ఆయనను భారీ మెజారిటితో గెలిపించారు.. దాంతో ఆ ఎమ్మెల్యే ఇచ్చిన హామీను నెరవేర్చారు.. అన్నట్లుగానే నాలుగు కిలో మీటర్ల మేరకు రోడ్లు వేయించారు..రోడ్డు నిర్మాణంతో సుమారు మూడు వందల కుటుంబాలు నివాసం ఉంటున్న ఈ గ్రామానికి దశాబ్దాల కల నెరవేరింది. దీంతో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఎమ్మెల్యే అలజంగి జోగారావు ను సన్మానించేందుకు ఏర్పాట్లు చేశారు..ఈ క్రమంలో ఆయనను తమ గ్రామానికి సాధారంగా ఆహ్వానించారు.. మేళ, తాలలతో ఊరేగించారు..దారి పొడవునా పూల వర్షం కురిపించారు.. అనంతరం గ్రామంలోని మహిళలు వందల లీటర్ల పాల బిందెలతో పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు చాటుకున్నారు.. తనకు జరిగిన సన్మానం తో భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు ఎమ్మెల్యే.. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి..

వైయ‌స్ జ‌గ‌న్‌ను మ‌ళ్లీ సీఎంగా గెలిపించాలి: ఎమ్మెల్యే జోగారావు
ప్రజలం దీర్ఘకాలిక సమస్యలను సహితం తీర్చడానికే తమ ప్రభుత్వం ఉంద‌ని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు.  రూ.2.80 కోట్ల రూపాయల నిధులతో 4.5 కిలోమీటర్ల అజ్జాడ - పి.చాకరపల్లి గ్రామ నూతన బీటీ రహదారిని ఎమ్మెల్యే ప్రారంభించి ప్ర‌సంగించారు.    

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక  మీ గ్రామానికి పక్కా తారు రోడ్డు వేసి మళ్లీ మీ గ్రామానికి వ‌స్తాన‌ని మాటిచ్చాన‌ని గుర్తు చేశారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌హ‌కారంతో ఇచ్చిన హామీని నెర‌వేర్చాన‌ని తెలిపారు.   ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అనతికాలంలోనే 2.80 కోట్ల రూపాయల నిధులతో గ్రామానికి 4.5 కిలోమీటర్ల మేర బిటి రోడ్డు మంజూరు చేయడమే కాకుండా, రోడ్డు పనులను దక్కించుకున్న గుత్తేదారుడు మధ్యలోనే చేతుల వెత్తేసి ముఖం చాటేసినా సరే, వదలక గ్రామానికి ఇచ్చిన మాట ప్రకారం తప్పక రోడ్డు నిర్మాణం చేసి తీరాలనే దృడ నిచ్చాయంతో ప్రత్యేక చొరవ తీసుకొని మరొక గుత్తేదారునికి పనులు అప్పచెప్పి మరీ సకాలంలో రోడ్డు నిర్మాణం పూర్తి చేయడమే కాకుండా నేడు ఆ గ్రామ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే శుభదినం అన్నారు.  
 ఇంతటి గొప్ప కార్యక్రమం సాకారం అయ్యింది అంటే అది కేవలం మన ప్రియతమ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ గారి ప్రభుత్వంలో మాత్రమే సాధ్యం అయినది గర్వంగా చెప్పుకోగలమని ఎమ్మెల్యే ప్రజలకు తెలియజేశారు. ప్రజలందరికీ ఎంతో మేలు చేసిన తమ ప్రభుత్వం ప్రియతమ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ గారికి మీరందరు తోడుగా ఉండి మళ్ళీ వచ్చే 2024 ఎన్నికల్లో ఆయనను ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ఎమ్మెల్యే కోరుతూ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.  

Back to Top