బాబు అవినీతి చేయ‌లేదని భువనేశ్వరి తిరుమలలో చెప్పగలరా..?

వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే వెలంప‌ల్లి శ్రీ‌నివాస్ సూటి ప్ర‌శ్న‌

విజయవాడ: చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని తిరుమల వేదికగా నారా భువనేశ్వరి చెప్పగలరా..? అని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ ప్రశ్నించారు. శ్మశానం వద్ద కూర్చొని, ఎవరు చనిపోయినా వాళ్లు చంద్రబాబు కోసమే చనిపోయారని టీడీపీ వాళ్లు లెక్కలు రాసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పిలుపునకు ప్రజల నుంచి స్పందన కరువైందన్నారు. స్కిల్‌ స్కామ్‌లో అన్ని ఆధారాలతోనే చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిందని చెప్పారు. ఆధారాలన్నీ బలంగా ఉన్నాయి కాబట్టే కోర్టు కూడా బాబుకు రిమాండ్‌ విధించిందన్నారు. 

తెలుగుదేశం పార్టీకి పవన్‌ కల్యాణ్‌ దత్తపుత్రుడు తాము మొదటే చెప్పామని, పవన్‌ స్వలాభం కోసం దేనికైనా సిద్ధమవుతాడన్నారు. తెలుగుదేశం, జనసేన కలిసి ఎక్కడ ఎన్ని సమావేశాలు పెట్టుకున్నా ఒరిగేదేమీ ఉండదన్నారు. పవన్, చంద్రబాబు, లోకేష్‌ని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తారన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top