చంద్రబాబుది ఐరన్‌ లెగ్‌

ఎక్కడ కాలు పెడితే అక్కడ.. పొత్తు పెట్టుకున్న పార్టీలు మటాష్‌

సీఎం వైయస్‌ జగన్‌ పాలన చూసి బాబు మైండ్‌ బ్లాంక్‌

బాబు మునిగితే నది కూడా అపవిత్రమైపోతుంది

ప్రజలకు క్షమాపణ చెప్పి దోచుకున్న డబ్బు రాష్ట్ర ఖజానాకు ఇవ్వండి

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలన చూసి చంద్రబాబుకు మైండ్‌ బ్లాంక్‌ అయ్యి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అన్నారు. మంగళగిరిలో తనయుడు లోకేష్‌ను కనీసం ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయిన రోజే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయిందన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే సుధాకర్‌బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిలా సీఎం వైయస్‌ జగన్‌ ప్రజా నాయకుడిగా ఎదిగారన్నారు. అది చూసి అక్కసుతో చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అని చెప్పుకునే చంద్రబాబు ప్రజల్లో చిరకాలం నిలిచేలా ప్రవేశపెట్టిన పథకం ఒక్కటైనా చూపించగలరా అని ప్రశ్నించారు. 

పేదలందరికీ విద్యను అందించాలని అమ్మఒడి పథకం తీసుకువచ్చారన్నారు. పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి రూ.15 వేలు సాయం కూడా అందించనున్నారన్నారు. జనవరి 26వ తేదీన ఈ పథకం ప్రారంభం కానున్నట్లు వివరించారు. కానీ చంద్రబాబు విద్యను అమ్ముకునే వారికి విద్యాశాఖ మంత్రి పదవి కట్టబెట్టాడన్నారు. 

చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మటాష్‌ అవుతుందని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అన్నారు. చంద్రబాబు నిజంగా మేధావిగా చెప్పుకునే చంద్రబాబుకు ఎన్నికల్లో ప్రజలు ఎందుకు తిరస్కరించారో అర్థం కాలేదా అని ప్రశ్నించారు. ఓటమి గురించి పరిశీలన చేసుకోకపోగా.. నలుగురిని కూర్చోబెట్టుకొని ఎందుకుఓడిపోయానో అర్థం కావడం లేదని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. జన్మభూమి కమిటీలు, ఇసుక దోపిడీ, అవినీతి, పోలవరం దోపిడీ, రైతు రుణమాఫీ మోసం, డ్వాక్రా రుణమాఫీ మోసం, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఇవ్వలేకపోవడం ఇలా చెబితే కొన్ని వేలు సంఖ్యల కారణాలు చంద్రబాబు ఓటమికి కారణాలు అన్నారు. 

రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి గత ఐదేళ్లలో దోచుకున్న రూ.7 లక్షల కోట్లను రాష్ట్ర ఖజానాకు పంపించు చంద్రబాబూ అని సుధాకర్‌బాబు అన్నారు. ఇసుక, మైనింగ్‌ ఇలా రాష్ట్రమంతా గజదొంగలను తయారు చేసి ఏజెంట్‌ రూపంలో కార్పొరేట్‌ దోపిడీ వ్యవస్థను చంద్రబాబు నడిపాడు. ఇలాంటి వ్యక్తికి రాజకీయ నాయకుడినని చెప్పుకునే అర్హత లేదన్నారు. రాజకీయ నాయకుడికి జాలి, దయ, ప్రేమ ఉండాలని, ఇప్పటికైనా సీఎం వైయస్‌ జగన్‌ను చూసి నేర్చుకో చంద్రబాబూ అని సూచించారు. రైతులకు పెట్టుబడిసాయం అందించేందుకు నెల్లూరులో రేపు వైయస్‌ఆర్‌ రైతుభరోసా పథకాన్ని సీఎం ప్రారంభిస్తున్నారని చెప్పారు. పోలవరం రివర్స్‌టెండరింగ్‌లో మిగిలిన వేల కోట్ల రూపాయలు చంద్రబాబుకు కనబడడం అని ప్రశ్నించారు. అవినీతి రహిత పాలనే «ధ్యేయంగా సీఎం ముందుకు కదులుతున్నారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ నేతృత్వంలోనే పోలవరం పూర్తవుతుందని చెప్పారు.  

సీఎం వైయస్‌ జగన్‌ చేస్తున్న సంక్షేమ పథకాల అమలును చేతనైతే అభినందించు లేకపోతే చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చో చంద్రబాబూ.. మనవడితో ఆడుకో.. లేదా తీర్థయాత్రలకు వెళ్లి నదిలో మునిగి పాపాలు కడుక్కోమని సూచించారు. కాకపోతే బాబు నదిలో మునిగితే ఆ నది కూడా అపవిత్రమైపోతుందన్నారు. 
 

Back to Top