భారం పడకూడదనే నిరాడంబరంగా ప్రమాణస్వీకారం

ఎండ తీవ్రత అధికంగా ఉంది.. ఇంటి వద్ద నుంచే వీక్షించాలి

ప్రజలను కోరిన ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, జోగి రమేష్‌

 

కృష్ణా: ప్రభుత్వంపై భారం పడకూడదనే ఆలోచనతో నిరాడంబరంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ ప్రమాణస్వీకారం చేయబోతున్నారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపాల్‌ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, జోగి రమేష్, రక్షణనిధి పరిశీలించారు. అనంతరం శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు కలిసికట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వంపై భారం పడకుండా సాదాసీదాగా ప్రమాణస్వీకారం చేస్తున్నారన్నారు. ప్రమాణస్వీకారానికి వచ్చే ప్రజలు, అభిమానులు ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. 
నిండు మనస్సుతో దీవించండి
ఓట్లు వేసి నిండుమనస్సుతో వైయస్‌ఆర్‌ సీపీని ఏ విధంగా ఆశీర్వదించారో.. అదే స్ఫూర్తితో ప్రజలంతా ఇంటి దగ్గర నుంచి ప్రమాణస్వీకార మహోత్సవాన్ని వీక్షించాలని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ కోరారు. ప్రమాణస్వీకార మహోత్సవానికి తరలివచ్చేందుకు ప్రజలంతా సిద్ధమవుతున్నారని, ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది కాబట్టి ఇంటి వద్ద నుంచే ప్రసారాలు చూస్తూ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని దీవించాలని కోరారు. ప్రమాణస్వీకారానికి వందల కోట్ల రూపాయల ఖర్చు చేసి ఆ ఖర్చును ప్రజల నెత్తిన రుద్దవద్దనే ఆలోచనతో సాదాసీదాగా వైయస్‌ జగన్‌ ప్రమాణస్వీకారం చేస్తున్నారన్నారు.

తాజా ఫోటోలు

Back to Top